మాతృత్వం.. ప్రతీ స్త్రీ కోరుకునే మధురమైన అనుభూతి. ఇక మాతృత్వాన్ని మించిన వరం కంటే.. ఈ ప్రపంచంలో మరోటి లేదు అని ప్రతి అమ్మ చెప్పే మాట. ఇక ఎదిగే బిడ్డను పొత్తికడుపుల్లో పడుకోబెట్టుకుని పాలు ఇస్తు ప్రతి తల్లి మురిసిపోతుంటుంది. అయితే కొన్ని కొన్ని పబ్లిక్ ప్లేసుల్లో బిడ్డ ఏడ్చినప్పుడు పాలు ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది. ప్రధానంగా తల్లి ధరించే దుస్తులు ఇందుకు కారణం అవుతాయి. అయితే తాజాగా పబ్లిక్ ప్లేస్ లోనూ కంఫర్టబుల్ గా తన కొడుక్కి పాలిస్తున్న వీడియోను షేర్ చేసింది ప్రముఖ తెలుగు నటి. అదీకాక ఫ్లైట్ లో కూడా సౌకర్యవంతగా కొడుక్కి పాలిచ్చింది ఈ యాంకర్. ఆ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సాధారణంగా పబ్లిక్ ప్లేసుల్లో పిల్లలకు పాలివ్వడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు మహిళలు. అందుకు వారు ధరించిన దుస్తులతో పాటుగా అక్కడి పరిసరాలు కూడా కారణం అవుతాయి. అయితే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు తనకు ఎదురుకావు అంటోంది ప్రముఖ సీరియల్ నటి, యాంకర్ సమీరా షెరీఫ్. సీరియల్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సమీరా ఆ మధ్య ‘అదిరింది’ కామెడీ షోకి యాంకరింగ్ కూడా చేసింది. ఆ తర్వత ఆ షో నుంచి సమీరాను తప్పించారు. ఈ క్రమంలోనే సమీరా తల్లి కావడంతో టోటల్ గా కొన్ని రోజులు బుల్లితెరకు దూరం అయ్యింది. ఇక కొడుకు పుట్టాక తన కొడుకుతో ఆడుకుంటూ.. మాతృత్వ మాధుర్యాన్ని ఆస్వాధిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సమీర ఓ వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. అందులో పబ్లిక్ ప్లేస్ లో తన కొడుక్కి చక్కగా పాలిస్తూ.. కనిపించింది.
అయితే పబ్లిక్ ప్లేస్ లోనే కాకుండా విమానంలో కూడా కొడుక్కి పాలిస్తున్న వీడియోను పోస్ట్ చేసింది.”నేను వేసుకున్న డ్రస్ చాలా కంఫర్ట్ గా ఉంది. ఇది నా కొడుక్కి పాలు ఇవ్వడానికి ఎంతో సౌకర్యవంతగా ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడికి ఆకలి అయినప్పుడల్లా పాలిస్తాను” అని ఆ వీడియో కింద రాసుకొచ్చింది సమీరా షెరీఫ్. ప్రముఖ నటి సన కొడుకు అన్వర్ తో సమీరాకు 2019లో వివాహం జరిగింది. వీరిద్దరు దాదాపు నాలుగు సంవత్సరాలు ప్రేమించుకుని తర్వాత పెళ్లితో ఒక్కటైయ్యారు. ఇక సమీర గతంలోనూ నిండు గర్భిణీగా ఉన్నప్పుడు స్కేటింగ్ చేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు కొడుక్కి పాలిస్తూ.. వీడియో షేర్ చేసింది. మహిళలు పిల్లలకు పాలిచ్చే విషయంలో దుస్తులు కారణం కావొద్దని ఈ సందర్భంగా సమీర చెప్పుకొచ్చింది.