హీరో విశ్వక్ సేన్, యాంకర్ దేవీ నాగవల్లి మధ్య జరిగిన ఇష్యు అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇష్యు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈక్రమంలో దేవీ నాగవల్లి ఎవరు అనే విషయం గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.అయితే.. దేవి నాగవల్లి జీవితం పూల పాన్పు ఏమి కాదు. ఓ స్త్రీగా ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈరోజు బాధ్యత గల జర్నలిస్ట్ స్థాయిలో నిలిచి ఉన్నారు.
దేవి నాగవల్లి బిగ్ బాస్-4 లో కంటెస్టెంట్ గా పాల్గొంది. ఆ సమయంలో తన గురించి ఆమె చెప్పుకొచ్చింది. తన పేరు నాగవల్లి అని.. పుట్టి, పెరిగిందంతా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోనే అని తెలిపింది. బీకామ్ వరకూ చదువుకున్న ఆమె గ్రాఫిక్స్ నేర్చుకుని గ్రాఫిక్ డిజైనర్ గా ఒక ఛానల్లో జాయిన్ అయ్యింది. అయితే.. గ్రాఫిక్ డిజైనర్ గా వెళ్లిన తనకు యాంకర్ గా చేయమని ఆఫర్ వస్తే ట్రై చేసింది. అలా డిజైనర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన దేవి.. అనుకోకుండానే యాంకర్ గా మారింది.
తన ఉరుకులు పరుగుల జీవితమంటే ఇష్టమని.. నేచర్ డిజాస్టర్, బ్లాంబ్ బ్లాస్ట్ వంటివి కవర్ చెయ్యడం చాలా ఇంట్రెస్ట్ అని బిగ్ బాస్-4 లోనే తెలిపింది దేవి. ఇక వ్యక్తిగత జీవితంలోకి వస్తే.. దేవీ నాగవల్లిది పెద్దలు కుదిర్చిన పెళ్లంట. పెళ్లైన తరువాత USA వెళ్లినట్టు కూడా చెప్పుకొచ్చింది. అయితే.. అక్కడ 8 నెలలకు మించి ఉండలేకపోయిందట. దాంతో విడాకులు తీసుకున్నానని కూడా చెప్పుకొచ్చింది. ఇప్పుడు దేవికి ఓ బాబు ఉన్నాడు. ఈ విషయాలు అన్నీ కూడా దేవి నాగవల్లి బిగ్ బాస్ వేదికగా స్వయంగా ప్రేక్షకులతో పంచుకోవడం విశేషం.”న్యూస్ చదివేటప్పుడు వాళ్ల దగ్గర అంత డబ్బు ఉంది.. ఇంత డబ్బు ఉంది, ఇంత సంపాదించారు అని చదువుతాను కదా! ఒక మనిషి అంత డబ్బు ఎలా సంపాదిస్తాడా అని అనిపిస్తుంటుంది. ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడ్డాను, వచ్చిన జీతం వచ్చినట్లు అయ్యేపోయేది, ఇన్ని కష్టాల నడుమ మనీ కోసమే బిగ్ బాస్ లోకి వచ్చాను” అని దేవి ఆ సమయంలో తెలియజేసింది.
తాజా వివాదం నేపథ్యంలో అప్పుడు దేవి తన గురించి చెప్పిన విషయాలు అన్నీ ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా.. జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. పట్టు వదలకుండా ఒక ఫైటర్ గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ, సమాజంలో జరుగుతున్న ఎన్నో తప్పులను ప్రశ్నిస్తు, ఒక ధీర వనితగా ముందుకి సాగిపోతున్న దేవి నాగవల్లి.. ఎంతో మంది మహిళలకి ఆదర్శం అని మాత్రం చెప్పుకోవచ్చు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.