తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షోతో బాగా పాపులర్ అయిన అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక హాట్ టాకిప్ తో ఆమెపై వార్తలు వస్తూనే ఉంటాయి. జబర్ధస్త్ యాంకర్ గా మంచి క్రేజ్ సంపాదించిన అనసూయ ప్రస్తుతం వెండితెరపై ఎక్కువగా దృష్టి సారిస్తుంది. ఇప్పటికే ఆమె చేతినిండా కొన్ని చిత్రాలు ఉన్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్. ఈ మద్య ఫారిన్ ట్రిప్ లో క్రేజీ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. తాజాగా యాంకర్ అనసూయ తన కుటుంబ సభ్యులతో జరుపుకున్న ప్రత్యేక పూజలకు సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి.
యాంకర్ అనసూయ తనకు సంబంధించిన మూవీస్, ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు ప్రతి విషయం సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా అనసూయ తన భర్త భరద్వాజ్ తో ప్రత్యేక పూజలు చేస్తున్న ఓ వీడియో ఇన్ స్ట్రాలో షేర్ చేసింది. అనసూయ కుటుంబ సభ్యులు సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నారు. కొంతమంది పండితులు వేద మంత్రాలు చదువుతున్నారు.. ఆమె కుటుంబ సభ్యులు హరినామాలు పెట్టుకున్నారు. అక్కడి పరిసరాలు చూస్తుంటే.. ఆమె సొంత ఊరిలో కులదైవం ప్రత్యేక పూజలు జరుపుకుంటున్నారేమో అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ఇటీవల జబర్ధస్త్ కామెడీ షోకి గుడ్ బై చెప్పి పూర్తిగా వెండితెరపై ఫోకస్ పెట్టింది అనసూయ. ఈ క్రమంలో తన జాతకం చూపించుకుందని.. ఏవైనా జాతక దోషాలు ఉంటే వాటికి పరిహారం కోసం ప్రత్యేక పూజలు చేయిస్తుందని మరో న్యూస్ చక్కర్లు కొడుతుంది. కాకపోతే దీనిపై అనసూయ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.. ఈ వీడియోకి ‘సర్వేజనా సుఖినోభవంతు’ అంటూ కామెంట్ చేసింది. ఏది ఏమైనా ఈ పూజా కార్యక్రమంలో అనసూయ మాత్రం హరినామం పెట్టుకొని.. నగలు ధరించి చాలా ట్రెడిషినల్ గా కనిపిస్తుంది. అనసూయ ప్రత్యేక పూజలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూసి నెటిజన్లు ఎప్పుడూ ఇలా సాంప్రదాయంగా ఉండొచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.