తెలుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షోలో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన అనసూయ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. కవ్వించే మాటలు.. ఆకర్షించే అందం.. డ్రెస్సింగ్ స్టైల్ తో ప్రేక్షకులను ఆకర్షించింది. స్మాల్ స్క్రీన్ పై తన అందాలతో ఒక్క ఊపు ఊపిన యాంకర్ అనసూయ ఓ వైపు టీవీ షోలు చేస్తూనే మరోవైపు వెండి తెరపై తన సత్తా చాటుతుంది. వరుసగా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.
ప్రస్తుతం అనసూయ ఫారెన్ టూర్ లో తెగ సందడి చేస్తుంది. ఫారెన్ ట్రిప్ కి సంబంధించిన వీడియోలు, ఫోటో తన ఇన్ స్ట్రాలో అభిమానులకు షేర్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ తన హాట్ ఫోటోలు, వీడియోలతో రచ్చ చేస్తున్న అనసూయ తాజాగా పొట్టి నెక్కర్ లో స్టైలిష్ లుక్ తో అభిమానులను ఆకర్షించింది. తలపై ఉన్న కూలింగ్ గ్లాస్ ని ముక్కుపైకి తీసుకు వచ్చి జుట్టు ఊపుతూన్న క్రేజీ వీడియోని షేర్ చేసింది. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు అనసూయ లుక్, స్టైల్ హీరోయిన్లను తలదన్నేలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
అందాల ప్రదర్శనలో హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గేదే లే అంటుంది అనసూయ. తాను ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ తన కుటుంబంతో కలిసి ఉండేందుకు ఎక్కువగా ప్లాన్ చేస్తుంది. ఇటీవల జబర్ధస్త్ నుంచి అనసూయ బయటికి వచ్చి ఇతర ఛానల్స్ లో యాంకరింగ్, జడ్జీగా కొనసాగుతుంది. అయితే అనసూయ వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ చూసి కొంత మంది నెటిజన్లు అసభ్య పదాలతో ట్రోలింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. దానికి అనసూయ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. తాజాగా అనసూయ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.