టాలీవుడ్ స్టార్ నటి, యాంకర్ అనసూయ తన అభిమానులకు మరోసారి బికినీ ట్రీట్ చేశారు. వైట్ బికినీలో ఉన్న ఓ వీడియోను ఆమె పంచుకున్నారు. ఈసారి బికినీలో పోజులే కాదు.. భర్తతో ఘాటు రొమాన్స్ చేస్తూ కనిపించారు అనసూయ.
యాంకర్ అనసూయకు తెలుగు నాట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్నేళ్లుగా ఆమె ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ హాట్ యాంకర్ బుల్లితెరతో పాటు వెండితెర మీద కూడా తన హవా చూపిస్తున్నారు. వరుసబెట్టి సినిమాలు చేస్తూ టాలీవుడ్లో నటిగా ఫుల్ బిజీ అయిపోయారు. ‘రంగస్థలం’, ‘పుష్ప’ చిత్రాలు ఆమెకు యాక్టింగ్ పరంగా పెద్ద ప్లస్ అయ్యాయి. ఈ సినిమాలతో అనసూయలో దాగి ఉన్న నటనా ప్రతిభ బయటపడింది. ప్రస్తుతం ‘పుష్ప 2’, ‘విమానం’ చిత్రాల్లో నటిస్తున్న అనసూయ.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. తన సినిమాలు, లైఫ్‌కు సంబంధించిన విశేషాలను ఫొటోలు, వీడియోల రూపంలో అభిమానులతో ఆమె పంచుకుంటున్నారు.
ఇటీవల భర్త, పిల్లలతో కలసి దిగిన పలు ఫొటోలను అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోల్లో ఆమె బికినీలో దర్శనమిచ్చారు. దీంతో ఏంటి అనసూయ.. ఇంత అందంగా ఉన్నావంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. తాజాగా మరోసారి బికినీ ఫొటోలను షేర్ చేశారు అనసూయ. ఈసారి భర్తతో కలసి సముద్రం ఒడ్డున ఘాటు రొమాన్స్ చేస్తూ కనిపించారామె. భర్త సుశాంక్ భరద్వాజ్‌కు లిప్ కిస్‌లు ఇస్తూ, ఆయన బుగ్గల్ని నిమరుతూ కనిపించారు అనసూయ. వైట్ కలర్ బికినీలో అనసూయ పోజులు ఇస్తూ దిగిన ఫొటోలు యువకులకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ఈ వయసులోనూ ఇంత హాట్‌గా ఎలా ఉన్నావ్ అంటూ అనసూయను ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. మరి.. భర్తతో కలసి అనసూయ దిగిన రొమాంటిక్ ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.