స్టార్ హీరో అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ఇటీవల డిసెంబర్ 17న ఐదు భాషల్లో రిలీజైన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లను కూడా రాబట్టుకుంది పుష్ప. అయితే, పుష్ప మూవీ విడుదలై నెల గడవకముందే మేకర్స్ అమెజాన్ ప్రైమ్ లో సినిమాని జనవరి 7న రిలీజ్ చేశారు.
పుష్ప రిలీజ్ ముందు ప్రమోషన్స్ కంటే రిలీజ్ అయ్యాకే ప్రమోషన్స్ ఎక్కువగా జరిగాయి. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా పుష్ప సినిమాకి ఓ రేంజిలో మద్దతు లభించిందని చెప్పవచ్చు. సక్సెస్ మీట్స్ తర్వాత పుష్ప హిట్ అయినందుకు వినూత్నమైన అభినందనలు అందుకుంటోంది. తాజాగా ప్రముఖ డైరీ బ్రాండ్ అమూల్ వెరైటీగా విష్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్, రష్మిక మందన పాత్రలను పోలి ఉన్న కార్టూన్ లను క్రియేట్ చేసి.. ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. ‘అమూల్ టాపికల్ కొత్త యాక్షన్ డ్రామా మూవీ భారీ హిట్. అముల్లు.. అర్జున్’ అంటూ క్యాప్షన్ జోడించి విష్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ అయింది.
ఈ పోస్ట్ పై అల్లు అర్జున్ ఇన్స్టాలో స్పందించి.. ‘అల్లు టు మల్లు టు అముల్లు అర్జున్’ అని పోస్ట్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అలాగే హీరోయిన్ రష్మిక కూడా స్పందించింది. అదేవిధంగా అమూల్ పోస్ట్ పై అమెజాన్ ప్రైమ్ వారు స్పందిస్తూ.. ‘ఇది వెన్న కాదు పువ్వు కాదు.. నిప్పు’ అంటూ రిప్లై ఇవ్వడం విశేషం. ఇదిలా ఉండగా.. పుష్ప సినిమాలో పుష్పరాజ్ గా ఫైర్ అనిపించాడు బన్నీ. ప్రస్తుతం పుష్ప-2 కోసం దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి అముల్లు అర్జున్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.