అల్లు అరవింద్.. ఈయన టాలీవుడ్‌లో ఎంత గొప్ప దర్శకుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గీతా ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ 2 అని నిర్మాణ సంస్థలతో ఓవైపు సినిమాలు నిర్మిస్తూనే.. మరోవైపు గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ పేరిట పరభాషా చిత్రాలను తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా కన్నడ సూపర్ డూపర్ హిట్ కాంతార సినిమాని తెలుగులో గీతా డిస్ట్రిబ్యూషన్ తరఫున విడుదల చేసిన విషయం తెలిసిందే. కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి నటించిన కాంతార సినిమా యావత్ భారతదేశంలో ప్రకంపనలు సృష్టించింది. తెలుగులో కూడా అద్భుతమైన హిట్‌గా నిలిచింది. అల్లు అరవింద్‌కు పేరుతో పాటు మంచి లాభాలను కూడా తెచ్చి పెట్టాయని చెబుతున్నారు.
అయితే ఇప్పుడు అల్లు అరవింద్ మరో పరభాషా చిత్రాన్ని తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. హిందీలో యంగ్ హీరోయ వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కిన భేడియా(తోడేలు) సినిమాని గీతా ప్రొడక్షన్ కంపెనీ తరఫున నవంబర్ 25న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ తోడేలు సినిమాలో వరుణ్ ధావన్ కు జంటగా కృతి సనన్ నటించింది. ఇది ఇండియన్ సినిమాలోనే తొలి క్రీచర్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ లో అయితే ఇలాంటి హారర్ కామెడీలు, థ్రిల్లర్ కామెడీ చిత్రాలు చాలానే వచ్చాయి. కానీ, ఇండియన్ సినిమాలో ఇలాంటి ఎంటర్ టైనర్ తొలిసారి రానుండటంతో ఆసక్తి పెరిగింది. పైగా అల్లు అరవింద్ లాంటి వ్యక్తి ఈ సినిమా విడుదల చేస్తున్నారు అనగానే అంచనాలు మరింత పెరిగిపోయాయి.
ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ వంటి అప్ డేట్స్ చూసిన తర్వాత ప్రేక్షుకులు ఇది సూపర్ హిట్ అవుతుందని అంచనాలు వేస్తున్నారు. అలాగే కాంతార తర్వాత అల్లు అరవింద్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందని ఆకాంక్షిస్తున్నారు. ఇంక సినిమా విషయానికి వస్తే.. భేడియా మూవీని నిర్మాత దినేష్ విజన్ తెరకెక్కించారు. స్త్రీ అనే హారర్ కామెడీతో దినేష్ విజన్ నిర్మాతగా పరిచయం అయ్యారు. అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత 2021లో రూహి చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు అతని నుంచి వస్తున్న ఈ భేడియా అనే హారర్ కామెడీపై అంచనాలు భారీగా నే ఉన్నాయి.