బాలీవుడ్ లో యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అక్షయ్ కుమార్. ఖిలాడీ మూవీలో అక్షయ్ చేసిన స్టంట్స్ కి మంచి క్రేజ్ వచ్చింది. స్వతహాగా మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రావిణ్యం ఉన్న అక్షయ్ కుమార్ కెరీర్ లో యాక్షన్ సినిమాల్లో నటించినప్పటికీ తర్వాత కుటుంబ కథా చిత్రాలతో అలరించారు.
సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోలుగా ఎదిగిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు.. అలాంటి వారిలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఒకరు. కెరీర్ బిగినింగ్ లో యాక్షన్ మూవీస్ లో ఎక్కువగా నటించిన అక్షయ్ తర్వాత ఫ్యామిలీ, రొమాంటిక్, కామెడీ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. బాలీవుడ్ లోనే కాదు ఇప్పుడు ఇతర భాషా చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. ఇప్పటి వరకు వంద చిత్రాలకు పైగా నటించిన అక్షయ్ కుమార్ కి తాజాగా ఓ అరుదైన గౌరవం దక్కింది. వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ లో ఖిలాడి చిత్రంతో అక్షయ్ కుమార్ యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా కూతురు ట్వింకిల్ ఖన్నాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఆరవ్, కుమార్తె నేత్ర. నటుడిగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు అక్షయ్ కుమార్.. ప్రకృతి వైపరిత్యాలు సంబవించిన సమయంలో భారీ విరాళాలు ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నాడు. ఇప్పటి వరకు వంద చిత్రాల్లో నించిన అక్షయ్ కుమార్ తన కెరీర్ లో ఎన్నో బాక్సాఫీస్ హిట్ చిత్రాల్లో నటించారు. రెండుసార్లు ఫిలింఫేర్ పురస్కారం అందుకున్నారు. తాజాగా అక్షయ్ కుమార్ ని మరో అదృష్టం వరించింది. తన అప్ కమింగ్ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొని కేవలం 3 నిమిషాల్లో 184 సెల్ఫీలు దిగి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఈ ఆనందాన్ని తన అభిమానులతో ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.
బాలీవుడ్ లో వరుస సినిమాలతో మంచి జోష్ మీద ఉన్న హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం ‘సెల్ఫీ’ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ముంబాయి లో నిర్వహించి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ తన కోసం వచ్చిన అభిమానులతో సెల్ఫీలు దిగారు. ఈ ఫీట్ తో అక్షయ్ కుమార్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నెటిజన్లు అక్షయ్ కుమార్ ని సెల్ఫీ కింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అక్షయ్ కుమార్ ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని ఫ్యాన్స్ కి సెల్ఫీలతో ఆనందాన్ని పంచారు.
గతంలో ఈ సెల్ఫీల పేరిట పలువురు హీరోలు రికార్డులు క్రియేట్ చేశారు. 2015 లో లండన్ లోని శాన్ ఆండ్రియాస్ మూవీ కార్యక్రమంలో స్టార్ నటుడు డ్వేన్ జాన్సన్ ఫ్యాన్స్ తో 3 నిమిషాల్లో 105 సెల్ఫీలు తీసుకొని రికార్డు క్రియేట్ చేశారు. ఆ తర్వాత 2018 లో అమెరికాకు చెందిన జేమ్స్ స్మిత్ మూడు నిమిషాల్లో 168 సెల్ఫీలతో గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు ఈ ఫీట్స్ మొత్తానికి చెక్ పెడుతూ అక్షయ్ కుమార్ 3 నిమిషాల్లో ఏకంగా 184 సెల్ఫీలు తీసుకొని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. తమ అభిమాన హీరోకి గిన్నిస్ బుక్ లో చోటు దక్కడంతో సోషల్ మీడియా వేధికగా అభిమానులు శుభకాంక్షలు తెలుపుతున్నారు.