అక్కినేని అఖిల్ సినిమాల విడుదల సమయంలో ఉత్సాహంతో ఊగిపోతూ.. ‘అయ్యగారే కరెక్టు.. అఖిల్ అయ్యగారే రావాలి’ అంటూ సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ఫేమస్ అయిపోయాడు. కాగా అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్ల వద్ద చేసిన సందడితో మరోసారి ఆ వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. చాలా మంది మీమర్స్ కూడా అతని ఫోటోలతో మీమ్స్ చేశారు. ఆ వ్యక్తి అక్కినేని అఖిల్‌కు వీరాభిమాని. అఖిల్ సినిమా రిలీజ్ అయినా అలాగే నాగచైతన్య, నాగార్జున సినిమాలు రిలీజ్ అయిన ఆ వ్యక్తి థియేటర్ల వద్ద చేసే సందడి అంతా ఇంతా కాదు.
ఇలా తన వీర అభిమానంతో చాలా క్రేజ్ సంపాదించుకున్నాడు. అతని అభిమానం గురించి తెలుసుకున్న అఖిల్ ఆశ్యర్య పోయాడు. తన అభిమాని తన కంటే కూడా ఎక్కువ పాపులర్ అయ్యాడని అన్నారు. తన ఫ్యాన్ ఇంత పాపులర్ అయినందుకు సంతోషిస్తున్నట్లు, త్వరలోనే అతన్ని కలుస్తానని ప్రకటించాడు. కాగా గూగుల్ కూడా ‘అయ్యగారు’ అని సెర్చ్ చేస్తే ఆ వ్యక్తి ఫోటో రావడం విశేషం.
I’m happy that my fan has become more popular. I would love to meet him soon – Akhil Akkineni on Instagram live about #Ayyagaru fan.#MostEligibileBachelor pic.twitter.com/CBBlwgzrRt
— Nandamuri Abhimani (@ntr_chalapathi) October 18, 2021
Loved This Guy Spirit ,Infact The movie has the same Dialouge “Ayyagaru” https://t.co/TWjdnXieeR pic.twitter.com/LkWevaI2vY
— TDP4All (@TDPTS4U) October 15, 2021
I would like to meet my #Ayyagaru fan very soon : #AkhilAkkineni pic.twitter.com/a90TGGad3F
— Aakashavaani (@TheAakashavaani) October 18, 2021