నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన ఇతడు.. హీరోగా స్టార్ స్టేటస్ సంపాదించాడు. నిర్మాతగానూ మారి కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తున్నాడు. మరోవైపు హీరోగానూ ఏడాది మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్య కాస్త ఆ జోరు తగ్గినట్లు కనిపించింది. మరోవైపు అడివి శేష్ కూడా నటుడిగా చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించాడు. ఇప్పుడు తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఇండస్ట్రీలో స్టార్ గా నిలదొక్కుకున్నాడు. ఇప్పుడు వీళ్లిద్దరి మధ్య జరిగిన ఓ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పలువురు సినీ ప్రేమికులు దీని గురించి మాట్లాడుకుంటున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. నానికి హైదరాబాద్ లో ఆఫీస్ ఉంది. అతడు నిర్మించిన ‘హిట్ 2’.. డిసెంబరు 2న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా ‘ఉరికే ఉరికే’ సాంగ్ ని రిలీజ్ చేశారు. యూట్యూబ్ లో ఈ పాట ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఆ పాటకు హీరోహీరోయిన్ అడివి శేష్, మీనాక్షి చౌదరి కలిసి డ్యాన్స్ చేశారు. అందుకు సంబంధించిన ఓ వీడియోని శేష్, తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ‘ఇలా డ్యాన్స్ చేయడం సిగ్గుగానే ఉంది. కానీ మీకోసం ఏదైనా చేస్తా’ అని రాసుకొచ్చాడు. ఈ డ్యాన్స్ లో శేష్-మీనాక్షి కెమిస్ట్రీ అదుర్స్ అనేలా ఉంది.
ఇక దీనికి రీట్వీట్ చేసిన ప్రొడ్యూసర్ నాని.. ‘నా ఆఫీస్ ని ఇలా కూడా వాడొచ్చా’ అని రాసుకొచ్చాడు. దీంతో పలువురు నెటిజన్స్… నానికి తెలియకుండా రొమాన్స్ చేసిన శేష్-మీనాక్షి అతడికి దొరికిపోయారు అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా 2020లో రిలీజైన ‘హిట్’ అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. హీరో విశ్వక్ సేన్ కి సరికొత్త ఇమేజ్ తీసుకొచ్చింది. డైరెక్టర్ శైలేష్ కొలనుకి కూడా ఫేమ్ అందించింది. ఇక ఈ ఫ్రాంచైజీలో వస్తున్న రెండో సినిమా కావడం, ఇందులో మర్డర్ మిస్టరీ, హీరోగా అడివి శేష్ ఉండటంతో అంచనాలు బాగానే కనిపిస్తున్నాయి. చూడాలి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతమేర ఆకట్టుకుంటుందో?
Naa office ni ila kooda vaadocha 🧐@AdiviSesh @Meenakshiioffl https://t.co/PVdIc5UrXn
— Nani (@NameisNani) November 12, 2022