ఈమె హీరోయినేం కాదు కానీ కుర్రాళ్ల మాత్రం ఈమెని తెగ ఫాలో అవుతుంటారు. సోషల్ మీడియాలోనూ ఈమెకి ఫ్యాన్స్ చాలామందే ఉన్నారండోయ్. చెప్పాలంటే వేరే లెవల్. చేసేవి హీరో లేదా హీరోయిన్ కి అమ్మ, అత్త క్యారెక్టర్లు అయినా సరే ఈమె క్రేజ్ కాస్త ఎక్కవే. ఈమెకు చాలావరకు పద్ధతిగా కనిపించే క్యారెక్టర్సే దర్శకనిర్మాతలు ఇస్తుంటారు. కానీ ఇన్ స్టాలో మాత్రం ఈమె గ్లామర్ షో చూస్తే మీరు కంట్రోల్ చేసుకోవడం కష్టం. అంతలా రచ్చ ఉంటుంది. ఆమెనే నటి సురేఖవాణి. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడూ వార్తల్లో నిలిచే ఈమె.. తన యాక్టింగ్ గురించి ఇప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సహాయనటిగా పదుల సంఖ్యలో సినిమాలు చేసిన సురేఖవాణి, చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంది. ఈమెకు సుప్రీత అనే కూతురు కూడా ఉంది. అందం విషయంలో వీరిద్దరూ పోటీపడుతూనే ఉంటారు. చెప్పాలంటే తల్లికూతుళ్లలా కాకుండా అక్కాచెల్లెళ్లలా ఉంటారు. వీరిద్దరూ చేసే రీల్స్ కి కుర్రాళ్లు ఎప్పుడూ ఫిదా అవుతూనే ఉంటారు. ఇదిలా ఉండగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తప్పించి సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు. ఈ విషయమై తాజాగా సురేఖవాణి క్లారిటీ ఇచ్చింది.
బెల్లంకొండ గణేశ్, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా నటించిన ‘స్వాతిముత్యం’.. దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ఇందులో సురేఖవాణి కూడా నటించింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో పాల్గొన్న సురేఖవాణి.. తను సినిమాలు ఎందుకు చేయట్లేదనే దాని గురించి మాట్లాడింది. ‘చాలామంది సినిమాల్లో ఎందుకు కనిపించట్లేదు అని అడుగుతున్నారు. అసలు మాదాకా వస్తే కదా చేయడానికి? మా వరకు అసలు అవకాశాలు రావట్లేదు. అలా ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు. నేను సినిమాలు మానేశానని అనుకుంటున్నారు. మంచి ఛాన్సులు వస్తే తప్పకుండా నటిస్తా. ‘స్వాతిముత్యం’లో మంచి రోల్ ఇచ్చినందుకు థాంక్స్’ అని నటి సురేఖవాణి చెప్పింది. మరి ఈమెకి ఛాన్సులు రాకపోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.