ప్రస్తుతం చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది సెలబ్రిటీలు యూట్యూబ్‌లో చానెల్ క్రియేట్ చేసుకుని.. వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు. ఇక ప్రతి సెలబ్రిటీ యూట్యూబ్ చానెల్‌లో తప్పకుండా కనిపించేది హోమ్ టూర్ వీడియో. అవును మరి తమ అభిమాన తారల ఇల్లు ఎలా ఉంటుంది.. ఇంటిని ఎలా అలంకరించుకుంటారు.. ఎలాంటి వస్తువులు ఉంటాయో చూడాలని ఫ్యాన్స్ ఆశపడతారు. అందుకు తగ్గట్టుగానే చాలా మంది సెలబ్రిటీలు.. యూట్యూబ్‌లో హోమ్ టూర్ వీడియోలు తప్పకుండా పోస్ట్ చేస్తారు. ఇక ప్రగతి కూడా తన హోమ్ టూర్ వీడియోని పోస్ట్ చేసింది. ఇక తన ఇల్లు.. ఇంట్లోని వస్తువులతో తనకు గల అనుబంధాన్ని చెప్పుకోస్తూ.. భావోద్వేగానికి గురయ్యింది ప్రగతి. ‘‘భవిష్యత్తులో ఎప్పటికైనా నాకంటూ ఓ సొంత ఇంటిని నిర్మించుకుంటానని నమ్మాను.. అందుకే 16 ఏళ్ల క్రితమే నేమ్ ప్లేట్ కొన్నాను.. ఆ తర్వాత పదేళ్లకు ఇంటిని నిర్మించాను’’ అని చెప్పుకొచ్చింది. అంతేకాక తన ఇంట్లోని ప్రతి వస్తువుకి.. ప్రతి మూలకు ఓ కథ ఉందని చెప్పుకొచ్చింది ప్రగతి.
ఇక సెలబ్రిటీల ఇల్లు అనగానే బాగా రిచ్‌గా.. కోట్లు ఖరీదు చేసే ఇల్లులా ఉంటుంది అనుకుంటారు.. కానీ తన ఇల్లు మాత్రం మధ్యతరగతి వారి ఇల్లు ఎలా ఉంటుందో అలానే ఉంటుందని చెప్పుకొచ్చింది ప్రగతి. ఇంట్లోని వస్తువలన్నింటిని.. చాలా ఏళ్ల నుంచి కొనుగోలు చేసి దాచానని.. వాటన్నింటిని ఇంటి నిర్మాణం చేపట్టాక ఒక్క దగ్గర చేర్చానని చెప్పుకొచ్చింది.
ఇక తన జీవితంలో జరిగిన మూడు అత్యద్భుతమైన సంఘటనలు అంటే.. డ్రీమ్ హౌస్ నిర్మాణం.. పిల్లలకు మంచి భవిష్యత్తు, వ్యక్తిత్వం ఇవ్వడం.. తనకోసం మంచి కెరీర్‌ను ఏర్పాటు చేసుకోవడం అని చెప్పుకొచ్చింది. ఇక తనకు ఫోటోలు దిగడం ఎక్కువగా నచ్చదని.. అందుకే తన ఫోటోలు ఇంట్లో ఎక్కువగా ఉండని చెప్పింది. కాకపోతే.. మొదటిసారి మేకప్ వేసుకుని కెమరా ముందుకు వచ్చిన ఫోటోని మాత్రం జ్ఞాపకంగా దాచుకున్నానని చెప్పుకొచ్చింది.
ఇక తన ఇంట్లో ఉన్న వస్తువులన్ని.. పురాతనమైనవి, అరుదైనవిగా ఉంటాయని చెప్పుకొచ్చింది. తనకు బుద్ధుడు, సూర్యుడు అంటే ఇష్టమని.. అందుకే చేతి మీద కూడా సూర్యుడి టాటూ వెయించుకున్నానని చెప్పుకొచ్చింది ప్రగతి. ఇంట్లోని ప్రతి వస్తువును ఎంతో కష్టపడి రూపాయి రూపాయి దాచి.. ఇష్టంగా కొనుక్కున్నానని చెప్పుకొచ్చింది. ఇక తన తల్లి గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యింది ప్రగతి. ఈ వీడియో చూసిన నెటిజనులు.. మీ ఇల్లు చాలా కామ్‌గా, ప్రశాంతంగా.. ఎంతో అందంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రసుత్తం ప్రగతి హెమ్ టూర్ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.