గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కరోనా కాటుకు పలువురు సినీ, ఇతర సాంకేతిక విభాగానికి చెందినవారు కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ నందిత శ్వేత ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి శివ స్వామి (54) కన్నుమూశారు. ఈ విషయాన్ని నందిత తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.
”నా తండ్రి శ్రీ శివ స్వామి 54 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నా శ్రేయోభిలాషులందరికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నా” అని ట్వీట్ పెట్టింది. ఆమె ట్విట్ కి ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. నందిత ఫ్యామిలీకి ధైర్యాన్నివ్వాలని కోరుకుంటున్నారు. ఇక నందిత విషయానికి వస్తే.. కర్ణాటకకు చెందిన నందిత శ్వేత.. 2008లో `నందా లవ్స్ నందిత` అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది.
2016 సంవత్సరంలో వచ్చిన హారర్ కామెడీ చిత్రం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత `శ్రీనివాస కళ్యాణం`, `బ్లఫ్ మాస్టర్`, `ప్రేమ కథా చిత్రమ్ 2`, `అభినేత్రి`, `సెవెన్`, `కల్కి`, `కపటదారి`, `అక్షర` చిత్రాల్లో నటించి మెప్పించింది. `అక్షర`లో మెయిన్ లీడ్‌గా ఆకట్టుకుంది. ప్రస్తుతం తమిళంలో `ఎంజీఆర్ మగన్` సినిమాలో నటిస్తుంది. ఈ అమ్మడికి తెలుగులో కన్నా తమిళ, మళియాళ భాషల్లో ఎక్కువగా ఛాన్సులు వస్తున్నాయి.
This is to inform all my wellwishers that My father Mr.shivaswamy aged 54 passed away today. May his soul rest in peace
— Nanditaswetha (@Nanditasweta) September 19, 2021