తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ స్థాయి క్రేజ్ హీరో విజయ్, అజిత్ కి వచ్చింది. ఈ ఇద్దరు హీరోలు నటించిన చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. అజిత్ నటించిన తెగింపు, విజయ్ నటించిన వారసుడు తమిళ నాట మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అజిత్ నటించి తునిపు తెలుగు లో తెగింపు పేరుతో సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైంది. మాస్ హీరోగా తమిళ నాట అజిత్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ మూవిని హెచ్.వినోద్ దర్శకత్వంలో జీ.సినివతో కాంబినేషన్ లో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోణీకపూర్ నిర్మించారు.జ బ్యాంకింగ్ వ్యవస్థపై రూపొందిన తెగింపు చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ లభిస్తుంది. తమిళనాట మంచి కలెక్షన్లు రాబడుతుంది.
ఇక ‘తెగింపు’ చిత్రంలో మాలీవుడ్ స్టార్ హీరోయిన్ మంజూ వారియర్ మంచి పెర్ఫార్మన్స్ చేశారు. ఈ చిత్రంలో మంజు వారియర్ నిడివి తక్కువే అయినా మంచి క్రేజ్ వచ్చింది. మంజు వారియర్ కేరళలో తుణిపు మూవీని విడుదల రోజే ప్రేక్షకుల మద్య కూర్చొని తిలకించారు. ఈ సందర్భంగా మంజు వారియర్ తన మసులో ఓ కోరిక ఉన్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. తునిపు చిత్రాన్ని మొదట కేరళ థియేటర్లో ప్రేక్షకుల మధ్య కూర్చొని చూడటం ఎంతో ఆనందం అనిపించిందని.. అదే విధంగా తమిళ ప్రేక్షకుల మధ్య కూర్చొని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఈ చిత్రంలో పూర్తి యాక్షన్ నటించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇలాంటి ఛాలెంజింగ్ చిత్రాల్లో నటించడం పెద్ద సాహసం అనే చెప్పాలి.. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నానని అన్నారు.
ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. తునిపు చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ నెల 20న చెన్నైకి వెళ్తున్నట్లుగా తెలిపారు. మాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న మంజు వారియర్ స్వతహాగా భరతనాట్య కళాకారిని.. ఈ నెల 20న చెన్నైలో జరగబోతున్న సర్య అనే వేడుకలో రాధేశ్యామ్ నృత్య రూపకాన్ని ప్రదరించబోతున్నట్టు తెలిపారు. ఇదే రోజు మళయాళంలో ఆమె నటించిన ఆయిషా చిత్రం రిలీజ్ కాబోతుంది.