ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో చిన్న చిత్రాల హవా కొనసాగుతుంది. కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని చిన్న చిత్రాలు నిరూపిస్తున్నాయి. అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహూల్ రామకృష్ణ ముఖ్యపాత్రల్లో నటించిన ‘జాతి రత్నాలు’ అంచనాలకు మించి సక్సెస్ సాధించింది. ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఫరియా అబ్ధుల్లా. అందం.. అభినయం మాత్రమే కాదు.. కామెడీ టైమింగ్ తో ఎవరినైనా ఇట్టే ఆకర్షింస్తుంది ఫరియా అబ్దుల్లా.
జాతిరత్నాలు చిత్రం తర్వాత ఈ అమ్మడికి పెద్దగా కలిసి రాలేదు. అయితే నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’ చిత్రంలో ఐటమ్ సాంగ్ లో నటించి కుర్రాళ్ల మనసు దోచింది. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న చిత్రం ‘లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు హీరో, హీరోయిన్. ఆ మద్య బిగ్ బాస్ సీజన్ 6 లో నాగార్జునతో కలిసి ఇంటి సభ్యులతో సందడి చేశారు. ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో హీరో సంతోష్ శోభన్ తో కలిసి వచ్చింది ఫరియా అబ్దుల్లా. ఈ సందర్భంగా జాతి రత్నాలు మూవీ సందర్భంగా తనపై డైరెక్టర్ చేయి చేసుకున్న విషయం గురించి ప్రస్తావించింది.
డైరెక్టర్ అనుదీప్ గురించి ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘ డైరెక్టర్ అనుదీప్ కి ఒక మేనరీజం ఉంది.. ఏదైనా జోక్ విన్నా.. చెప్పినా పక్కన నవ్వుతూ పక్కవాళ్లను కొడుతుంటాడు. షూటింగ్ సమయంలో అనుదీప్ అందరితో చాలా ఫన్నీగా ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక జోక్ వేస్తూ అందరినీ నవ్విస్తుంటారు. జాతిరత్నాలు మూవీ షూటింగ్ సమయంలో ఆయన ఒక జోక్ వేశారు.. ఆ సమయంలో పక్కన నేను ఉన్నాను.. నన్ను చేత్తో అలా అన్నారు.. దాన్ని చూసి అందరూ వేరే రకంగా ఊహించుకున్నారు. ఇది జస్ట్ ఫన్నీగా జరిగింది.. అంతే ’ అంటూ క్లారిటీ ఇచ్చింది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఉందని తన మనసులోని కోరిక బయట పెట్టింది ఫరియా అబ్దుల్లా.