ఈ మధ్యకాలంలో భాషతో సంబంధం లేకుండా రియాలిటీ షోలను ఆదరిస్తున్నారు టీవీ ప్రేక్షకులు. అందుకు ఉదాహరణగా నిలుస్తోంది బిగ్ బాస్. తెలుగు రాష్ట్రాలలో బిగ్ బాస్ షోను ఆదరించే ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు తెలుగులో 5 సీజన్లు, హిందీలో 15 సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న బిగ్ బాస్ షో.. తమిళంలో కూడా 5 సీజన్లు పూర్తి చేసుకుంది.
ఇటీవల తమిళ బిగ్ బాస్ షోకి విశ్వనటుడు కమల్ హాసన్ హోస్ట్ గా గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అప్పటినుండి తమిళ బిగ్ బాస్ షోకి హోస్ట్ ఎవరు అనే ప్రశ్న అందరిలో నెలకొంది. ఆ ప్రశ్నకు తాజాగా తమిళ బిగ్ బాస్ యాజమాన్యం.. డిస్నీ హాట్ స్టార్ ప్రోమో ద్వారా జవాబిచ్చింది. ఇక బిగ్ బాస్ తమిళ షోకి హోస్ట్ గా స్టార్ హీరో శింబు వ్యహరించబోతున్నాడు. ప్రస్తుతం కొత్త ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక ఫిబ్రవరి 26 నుండి బిగ్ బాస్ తెలుగు OTT షో డిస్నీ హాట్ స్టార్ లో ప్రారంభం కాబోతుంది. 18 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటున్న ఈ షో 84 రోజులపాటు కొనసాగనుందని సమాచారం. తెలుగు బిగ్ బాస్ హోస్ట్ గా అక్కినేని నాగార్జున వ్యవహరిస్తున్న విషయం విదితమే. ఇప్పటికే తెలుగు ఓటిటి షో కోసం ఫ్యాన్స్ ఓ రేంజిలో వెయిట్ చేస్తున్నారు. మరి బిగ్ బాస్ కొత్త ప్రోమో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#STRtheHostOfBBUltimate 💥 pic.twitter.com/GWozob5Kwu
— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) February 24, 2022