బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. కేవలం నటుడిగానే కాకుండా బుల్లితెరపై వ్యాఖ్యాతగా, వ్యాపార వేత్తగా పలు రంగాల్లో తనదైన ముద్ర వేశారు. ఇటీవల షారూఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ వివాదం బాలీవుడ్ లో సంచలనం రేపింది. తాజాగా షారూఖ్ ఖాన్ కి ముంబై ఎయిర్ పోర్ట్ లో ఊహించని చేదు అనుభవం ఎదురైంది. షార్జాలో ఒక కార్యక్రమానికి వెళ్లి వస్తున్న షారూఖ్ అతని బృందాన్ని కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే..
ఇటీవల దుబాయ్ లో జరిగిన ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ కార్యక్రమానికి షారూఖ్ ఖాన్ వెళ్లారు. అక్కడ షారూఖ్ కొన్ని ఖరీదైన వాచీలను కొనుగోలు చేశారు. దుబాయ్ నుంచి ముంబాయి ఎయిర్ పోర్టు కి వచ్చిన షారూఖ్ తో పాటు అతని బృందాన్ని కస్టమ్స్ అధికారులు బ్యాగ్స్ తనిఖీ చేయడంతో రూ.18 లక్షల విలువైన వాచీలు లభించాయి. కస్టమ్స్ డ్యూటీ కింద రూ.6.83 లక్షలు కట్టించుకొని కొన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాక షారూఖ్ తో పాటు అతని మేనేజర్ ని బయటికి వదిలినట్లు సమాచారం. అయితే షారూఖ్ బాడిగార్టులను మాత్రం ప్రశ్నించి ఉదయం వదిలినట్లు వార్తలు వస్తున్నాయి.
షారూఖ్ ఖాన్ ని కస్టమ్స్ అధికారులు అడ్డుకోవడం కొత్త ఏమీకాదు.. 2011 లో విదేశాల నుంచి ఖరీదైన వస్తువులు తీసుకురావడంతో ఏకంగా రూ.1.50 కోట్లు కస్టమ్స్ డ్యూటీ కింద చెల్లించాడు. ఆ మద్య షారూఖ్ నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం షారూఖ్ పఠాన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం హిట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు బాలీవుడ్ బాద్ షా. ఈ మూవీలో షారూఖ్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది.