తెలుగు టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సెలబ్రిటీ టాక్ షోలలో ‘ఆలీతో సరదాగా‘ ముందువరుసలో ఉంటుంది. ఇండస్ట్రీలో ప్రేక్షకుల ఆదరాభిమానాలు అదనుకుంటున్న తారలను, ప్రేక్షకులు మర్చిపోయిన సెలబ్రిటీలను, తెరముందు కనిపించే నటీనటులను, తెర వెనుక కష్టపడే టెక్నీషియన్లతో సహా అందరినీ మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రామ్. ఈ టాక్ షోకి స్టార్ కమెడియన్ ఆలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
ప్రతి సోమవారం ఈటీవీలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి ఒక్కొక్కరిగా సీనియర్ నటీనటులంతా వస్తున్నారు. కాసేపు సరదాగా మాట్లాడినా.. షో ముగిసే సమయానికి వారి లైఫ్ లో, కెరీర్ లో జరిగిన మంచి విషయాలు, చేదు జ్ఞాపకాలు బయట పెడుతుంటారు. అయితే.. ఆలీతో సరదాగా షోకి సంబంధించి తాజాగా కొత్త ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో విడుదలైంది. ఈ వారం గెస్ట్ గా తెలుగులో విలన్ పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సత్యప్రకాష్ హాజరయ్యాడు. తెలుగుతో హిందీ, కన్నడ, తమిళం ఇలా ఇండియన్ లాంగ్వేజెస్ లో నటించిన సత్యప్రకాష్.. 2020లో ‘ఉల్లాలా ఉల్లాలా’ అనే సినిమాతో దర్శకుడిగా డెబ్యూ చేశారు.ఇక ప్రోమోలో సత్యప్రకాష్ పుట్టిన ఊరు.. తాను పెరిగిన ప్రాంతం.. కెరీర్ కి ముందు ఉద్యోగం.. సినీ ఎంట్రీ ఇలా అన్ని విషయాలు షేర్ చేసుకున్నాడు. అయితే.. చివరికి వచ్చేసరికి ఎమోషనల్ అయిపోయాడు. కెరీర్ లో జరిగిన ఘోరమైన అవమానం గుర్తుచేసుకున్నాడు. ఒక స్టార్ హీరో సినిమా టైంలో ఫైట్ సీన్ జరుగుతుండగా ఎక్సప్రెషన్ సరిగ్గా రాలేదని.. ఆ సినిమా కో-డైరెక్టర్ వచ్చి.. “ఇలాంటి దరిద్రపు నా కొడుకులంతా ఇండస్ట్రీకి వచ్చేస్తున్నారు.. అందుకే ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది” అని అవమానించాడని కంటతడి పెట్టుకున్నాడు. ప్రస్తుతం సత్యప్రకాష్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి సత్యప్రకాష్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.