సినీ ఇండస్ట్రీలో ఫేమ్ లోకి వచ్చిన ఆర్టిస్టులు, హీరో హీరోయిన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. కానీ.. ఫేమ్ లోకి రావడానికి, కెరీర్ పరంగా సక్సెస్ అవ్వడానికి పడిన కష్టాల గురించి ఎవరూ మాట్లాడుకోరు. అయితే.. ఆర్టిస్టులుగా ఎవరి కష్టాల గురించి వారే సమయం, సందర్భమే వచ్చినప్పుడు బయట పెడుతుంటారు. ఈ క్రమంలో టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకున్న రవివర్మ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ కి సంబంధించి పలు విషయాలు షేర్ చేసుకున్నాడు.
ఆ ఇంటర్వ్యూలో భాగంగానే రవివర్మ కెరీర్ లో స్ట్రగుల్స్, జరిగిన ప్రమాదాలు కూడా చెప్పుకొచ్చాడు. వెన్నెల మూవీ షూటింగ్ లో మీ కన్నుకు గాయమైందని విన్నాం. నిజమేనా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు రవివర్మ స్పందిస్తూ.. “అవునండి. వెన్నెల షూటింగ్ చేసే టైంలో ఓ యాక్షన్ సీన్ చేస్తున్నాం. అప్పుడు నా కన్నుకు గాయమై ఐదు కుట్లు పడ్డాయి. అక్కడ ప్రొడక్షన్ వాళ్ళు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. కానీ.. గాయపడినప్పటికీ షాట్ ఓకే అయ్యింది.
మరోసారి బుల్లెట్ ఫైరింగ్ సీన్ లో నాకు చెవులకు ఇయర్ బర్డ్స్ అడిగితే లేవన్నారు. దాంతో షూటింగ్ చేసేటప్పుడు నా చెవి వినికిడి 20-30% మందగించింది. అక్కడ సేఫ్టీ లేకపోవడం వల్ల అలా జరిగిందని అనుకున్నాం. డాక్టర్ కూడా ఏమి చేయలేమని చెప్పేశాడు. అయితే.. నాకేమో గాని వెన్నెల షూటింగ్ టైంలోనే హీరో శర్వానంద్ కి చేస్త దగ్గర ఓ బుల్లెట్ పెట్టారు. అది పేలిస్తే శర్వాకి చర్మం కాలిపోయింది. అలా శర్వాకి స్కిన్ హర్ట్ అయ్యింది” అంటూ చెప్పాడు రవివర్మ. ప్రస్తుతం అతని మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి రవివర్మ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.