నటసింహం నందమూరి బాలకృష్ణ ‘ఇండియన్ ఐడల్‘ షోలో సందడి చేశారు. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ప్రసారం అవుతున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్’ చివరిదశకు చేరుకుంది. లేటెస్ట్ ఎపిసోడ్ కు లెజెండరీ సింగర్ ఉషా ఉత్తుప్ హాజరవగా.. బాలయ్య కూడా షోలో తన వాక్ చాతుర్యంతో సందడి చేశారు. బాలయ్య రాకతో స్టేజ్ దద్దరిల్లిపోయింది. ‘కాజువల్ గా రాలేదు.. కాంపిటీషన్ కు వచ్చాను’ అంటూ సరదాగా తన పంచు డైలాగ్స్ తో అందరిలో జోష్ నింపారు బాలయ్య. ఆ సమయంలోనే బాలకృష్ణ రాసిన పుస్తకం అంటూ.. ఆ ప్రోగ్రామ్ యాంకర్, సింగర్ శ్రీరామ్‌చంద్ర తీసుకొచ్చి అందరికీ చూపించారు.
అసలు విషయానికొస్తే.. ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న ఓ కంటెస్టంట్‌కు త్వరలో వివాహం జరగనుంది. దీంతో ఆ విషయం యాంకర్.. బాలకృష్ణకు చెప్పారు. వెంటనే బాలయ్య.. ‘ఏంటి పెళ్లి చేసుకుంటున్నావా? ఎప్పుడు అని అడగను! ఎందుకు అని అడుగుతా?’ అని సరదాగా అన్నారు. ఆ తర్వాత ఓ పుస్తకాన్ని ఆ కంటెస్టంట్‌కు గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు చెప్పారు. ‘భార్యను ఏమార్చడం ఎలా? 30 సూత్రాలు.. రిటన్ బై ఎన్బీకే’ అనే కవర్పేజ్తో ఉన్న బుక్‌ను చూడగానే ఒక్కసారిగా ఆ స్టేజ్ అంతా నవ్వులు పూశాయి.
షోను కాస్త ఇంట్రెస్టింగ్గా మార్చడంలో భాగంగా ఇలా బాలయ్య పేరుతో సరదాగా ఓ పుస్తకాన్ని సృష్టించి, త్వరలో పెళ్లి చేసుకోనున్న కంటెస్టెంట్‌కు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో మరో లేడీ సింగర్‌కు లౌడ్‌స్పీకర్‌ను కానుకగా ఇచ్చారు బాలకృష్ణ. మరో కంటెస్టెంట్‌ను పూజా హెగ్డేతో పోల్చుతూ నవ్వులు పూయించారు. ఈ ప్రోగామ్ ప్రోమో విడుదలైన కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి ఎపిసోడ్ జూన్ 10న ‘ఆహా’లో ప్రసారం కానుంది.
You guessed it right… Edaina aayana diganantha varake, once he steps in Entertainment doubles 💥
Witness the Unstoppable Top 6 with NBK on June-10th 🔥#NandamuriBalakrishna @MusicThaman @MenenNithya @singer_karthik @Sreeram_singer @fremantle_india pic.twitter.com/ayDqx7gral
— ahavideoin (@ahavideoIN) May 30, 2022
ఇది కూడా చదవండి: NTR శత జయంతి.. తాతను గుర్తు చేసుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్!
దాదాపు పదిహేను వారాల పాటు సాగిన ‘తెలుగు ఇండియన్ ఐడల్’ షో ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఇప్పుడు సెమీ ఫైనల్స్ జరగబోతున్నాయి. ఇందులో ఆరుగురు కంటెస్టెంట్స్ శ్రీనివాస్, జయంత్, వాగ్దేవి, ప్రణతి, లాలస, వైష్ణవిలు టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. వీళ్లను ఫినాలేకు చేర్చేందుకు జూన్ 3 నుండి జూన్ 6 ఉదయం 7 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మీరు ఓటింగ్ లో పాల్గొని మీకు నచ్చిన కంటెస్టెంట్స్ కు ఓట్ చేయొచ్చు. ఇక.. బాలయ్య సినిమాల విషయానికొస్తే.. అఖండ సినిమా విజయంతో బాలకృష్ణ సూపర్ ఫామ్ లోకి వచ్చారు. ప్రస్తుతానికి ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నారు.