ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆరోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాల్లో కొంత మంది నటులు చనిపోతే.. జీవితంపై విరక్తి తో ఆత్మహత్యలు చేసుకొని కొంతమంది నటీనటులు చనిపోతున్నారు. ఈ నెల 15న ప్రముఖ బుల్లితెర నటి వైశాలి టక్కర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో రాహూల్ నవ్లానీ తన మరణానికి కారణం అంటూ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ నవ్లానీని అరెస్టు చేశారు పోలీసులు.
వైశాలి టక్కర్ ఆత్మహత్యపై సహ నటుడు నిశాంత్ మల్ఖానీ పలు సంచలన విషయాలు బయట పెట్టాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నితిన్ పలు సంచలన విషయాలు బయట పెట్టారు. వైశాలి ఎంతో గొప్ప భవిష్యత్ ఊహించుకుందని.. ఆమె ఎంతో మనోధైర్యంతో ఉండే అమ్మాయి అని అన్నాడు. ఆమె తనతో ఎన్నో వ్యక్తిగత విషయాలు పంచుకునేదని.. రాహుల్ నవ్లానీ పరిచయం అయిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని.. ఒక దశలో వైశాలి ఆత్మహత్య చేసుకునేలా చిత్ర హింసలకు గురి చేశాడని నిశాంత్ ఆరోపించాడు.
వైశాలిని ఎంతో నమ్మించి మోసం చేశాడని.. తన తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బహిర్గతం చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. నిశాంత్ మల్ఖానీ తో పలు టీవీ సీరియల్స్ లో నటించి మంచి పేరు సంపాదించింది వైశాలి టక్కర్. రాహుల్ నవ్లానీ కొంత కాలంగా వైశాలిని ఎడిపిస్తున్నాడని.. ఆమెపై లేనిపోని తప్పుడు ప్రచారాలు చేశారని.. అతనితో ఉన్న ఫోటోలు పెళ్లి కొడుకు కి పంపించాడని.. దాంతో నిశ్చితార్థం ఆగిపోయిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు.