ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. పెళ్లి లైఫ్ బోర్ కొట్టగానే విడాకులు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఒకరిని ఒకరు ఇష్టపడినప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. ఇద్దరి మధ్య ఇష్టం పోగానే విడాకులు తీసుకుంటున్నారు. అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు..? పెళ్లికి ఉన్న విలువను ఎందుకు తగ్గించడం? అని సందేహాలు రావచ్చు. కానీ ఇవన్నీ బాలీవుడ్ లో మామూలే.
తాజాగా సీరియల్ నటుడు కరణ్ మెహ్రా.. తన భార్య నిషా రావల్ పై చేసిన షాకింగ్ కామెంట్స్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న కరణ్ – నిషా.. విడిపోయి ఏడాది పూర్తవుతోంది. అయినా వీరి విడాకుల వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. కరణ్ మెహ్రా పై నిషా రావల్ గృహహింస కేసు పెట్టడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బెయిల్ పై విడుదలైన కరణ్.. భార్య నిషాపై తీవ్ర ఆరోపణలు చేశాడు.
“తనను తానే గాయపర్చుకొని నిషా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తోంది. నా నుండి భారీగా భరణం పొందేందుకే ఇలా చేస్తోంది. 11 నెలలుగా నా ఇంట్లో వేరే వ్యక్తి ఉంటున్నాడు. నా ముందే నా భార్యతో కాపురం చేస్తున్నాడు. నన్ను, నా పిల్లలను విడిచిపెట్టి నిషా ఆ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అంతేగాక నా ఆస్తులు, వ్యాపారాలు అన్నీ లాక్కున్నారు. నిషాతో ఎప్పుడూ ఉండే సన్నిహితులు రోహిత్ వర్మ, మునీషా ఖట్వా ఇప్పుడు ఆమెతో ఎందుకు లేరు” అని కరణ్ మెహ్రా మీడియా ముందు మాట్లాడారు.
ఇక కరణ్ ఆరోపణలపై నిషా స్పందిస్తూ.. ‘నాకు అతడి నుండి ఎలాంటి భరణం వద్దు. ఇద్దరం కలిసి సంపాదించుకున్నాం. దాన్ని మళ్లీ నేనే ఎందుకు అడుగుతాను. చిన్నవయసు నుండే నాకు నేనుగా ఎదిగాను. యే రిష్తా సీరియల్ లో భాగం కాకముందు నుండే నేను అతనికి సపోర్ట్ గా ఉన్నాను. అతని డబ్బు నాకు అవసరం లేదు’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నెట్టింట కరణ్ – నిషాల విడాకుల వ్యవహారం వైరల్ అవుతోంది. మరి ఈ వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.