యాక్షన్ కింగ్ అర్జున్ కి, హీరో విశ్వక్ సేన్ కి మధ్య గొడవ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే హీరో అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా, అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా ఓ సినిమా అనౌన్స్ చేశారు. తన కూతురిని ఇంట్రడ్యూస్ చేస్తూ హీరో అర్జునే సినిమాకు నిర్మాతగా మారారు. అయితే.. మొత్తానికి అర్జున్ – విశ్వక్ సేన్ కాంబినేషన్ లో ఓ మంచి సినిమా రాబోతుందని అందరూ ఎక్సపెక్ట్ చేశారు. కానీ.. అంతలోనే ఏమైందో తెలియదుగాని.. సినిమా నుండి విశ్వక్ సేన్ తప్పుకున్నాడని.. అర్జున్ కి, విశ్వక్ కి మధ్య వివాదం జరిగిందని వార్తలు బయటికి వచ్చాయి.
ఈ విషయం హీరో అర్జున్ చెవిన పడేసరికి తాజాగా ప్రెస్ మీట్ పెట్టి, అసలు విశ్వక్ కి, తనకు మధ్య ఏం జరిగింది అనే విషయాన్నీ బయటపెట్టారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ.. “ఎంతో గ్రాండ్ గా ఒక మంచి సినిమాతో నా కూతురు ఐశ్వర్యని తెలుగులో లాంచ్ చేయాలనీ అనుకున్నాను. మంచి స్క్రిప్ట్ రెడీ చేసి.. దానికి హీరోగా విశ్వక్ సేన్ ని అనుకున్నాం. అతను కథ విన్నాక బాగా నచ్చిందని చెప్పి ఓకే అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. ప్రాజెక్ట్ ఓకే చేసి రెండు నెలలు అవుతుంది. అయినా మాకు విశ్వక్ నుండి, విశ్వక్ మేనేజర్ నుండి సరైన రెస్పాన్స్ లేదు. స్టోరీ డిస్కషన్స్ కి రమ్మని కాల్ చేస్తే రియాక్ట్ అవ్వలేదు. అతని ప్రవర్తన వల్ల మా టీమ్ అంతా చాలా హర్ట్ అయ్యింది.
మాములుగా కథ బాలేదని, ప్రొడ్యూసర్ నచ్చలేదని సినిమా నుండి వెళ్ళిపోతే అదివేరు. కానీ.. ఇక్కడ అర్జున్ సినిమా నుండి విశ్వక్ సేన్ బయటికి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అదే జరిగితే నా దగ్గర తప్పుందని అనుకుంటారు. సో.. దానిపై పబ్లిక్ క్లారిటీ ఇవ్వడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టాను. ఇక సినిమా మూడు రోజుల్లో స్టార్ట్ అవుతుందనే టైంలో.. విశ్వక్ వాళ్ళ మేనేజర్ వచ్చి.. మొత్తం షెడ్యూల్ వాయిదా వేయాలని చెప్పాడు. నేను 3 డేస్ అంటే ఓకే కానీ.. మొత్తం షెడ్యూల్ అంటే.. అందరు యాక్టర్స్ ని సెట్ చేసి పెట్టుకున్నాను. సరే అని ఆ షెడ్యూల్ క్యాన్సల్ చేశాను. ఇలా అన్ని అతనికి ఫేవర్ గా చేస్తూ వచ్చాము. రేపు షూటింగ్ అనగా.. షూటింగ్ క్యాన్సల్ చేయమని మెసేజ్ పెట్టాడు.
ఆ మెసేజ్ చూడగానే మాకు చాలా అవమానంగా అనిపించింది. ఇంత అన్ ప్రొఫెషనలిజమా అనుకోని.. ఈ సినిమా జరగట్లేదని చెప్పాను. నేను నా కెరీర్ లో ఎవరికీ అన్ని మిస్డ్ కాల్స్ చేయలేదు. ఎంతోమంది కమిట్మెంట్ చూశాను. కానీ.. ఇలా చూడలేదు. ఒక ప్రొడ్యూసర్ కి అతను ఏం రెస్పెక్ట్ ఇచ్చారో తెలియలేదు. దీంతో అతనితో ఇంకా సినిమా చేయలేనని చెప్పేశాను. షూటింగ్ చేయాల్సిన నేను.. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి వస్తుంది. ఈ ప్రెస్ మీట్ అతనిపై కంప్లైంట్ ఇవ్వాలని కాదు. అసలు ఏమి జరిగిందనేది తెలియాలనేది నా పాయింట్” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విశ్వక్ గురించి అర్జున్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.