టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ఆచార్య. దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 29న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ కీలకపాత్రల్లో నటించారు. అయితే.. చిరు – చరణ్ ఒకే సినిమాలో అనేసరికి మెగా ఫ్యాన్స్ లో అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి.
ఇక ఇప్పటికే కరోనా కారణంగా ఆచార్య మూవీ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో ఏప్రిల్ 29న డేట్ ఫిక్స్ చేసేసరికి సినిమా ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా ఆచార్య ట్రైలర్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ 12న ఆచార్య ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ట్రైలర్ డేట్ వచ్చేసరికి మెగాఫ్యాన్స్ లో ఆనందం రెట్టింపు అయ్యింది. అందులోనూ ఇటీవలే ట్రిపుల్ ఆర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు చరణ్. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
The date is set for the arrival of the MEGA PHENOMENA 🔥🔥
Witness the Mighty #AcharyaTrailer on 12th April 💥💥#AcharyaOnApr29
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma @MatineeEnt @KonidelaPro @adityamusic pic.twitter.com/84fP1bXa2k
— Matinee Entertainment (@MatineeEnt) April 9, 2022