95వ ఆస్కార్ వేడుకలలో తెలుగు సినిమా సత్తా చాటబోతుందా? ఆర్ఆర్ఆర్ మూవీ నుండి నాటు నాటు సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అయినప్పటి నుండి అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఎట్టకేలకు ఆస్కార్ కి కొద్దీ నిమిషాల చేరువలోకి నాటు నాటు చేరుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు విజయం ఖరారైందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత కాలమానం ప్రకారం తెల్లవారు జామున ఆస్కార్ వేడుకలు ఆర్ఆర్ఆర్ నాటు నాటు ఊపుతో మొదలైనట్లు తెలుస్తోంది.
95వ ఆస్కార్ వేడుకలలో తెలుగు సినిమా సత్తా చాటబోతుందా? ఆర్ఆర్ఆర్ మూవీ నుండి నాటు నాటు సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అయినప్పటి నుండి అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఎట్టకేలకు ఆస్కార్ కి కొద్దీ నిమిషాల చేరువలోకి నాటు నాటు చేరుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు విజయం ఖరారైందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. ముందునుండే నాటు నాటు ప్రపంచదేశాలకు ఊపేస్తూ.. ఇక్కడిదాకా వచ్చింది. ఆల్రెడీ ఆర్ఆర్ఆర్ సినిమాని సీన్ టు సీన్ డీటైలింగ్ తో కొనియాడారు హాలీవుడ్ దిగ్గజాలు. ఆస్కార్ కి ముందు గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో కూడా నాటు నాటు విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఇక 95వ ఆస్కార్ వేడుకలు లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో అట్టహాసంగా మొదలయ్యాయి. భారత కాలమానం ప్రకారం తెల్లవారు జామున ఆస్కార్ వేడుకలు ఆర్ఆర్ఆర్ నాటు నాటు ఊపుతో మొదలైనట్లు తెలుస్తోంది. ఆస్కార్ పై నామినేషన్స్ మొదలు పెట్టే ముందు ఆస్కార్ హోస్టులు సైతం నాటు నాటు పాటకు స్టెప్స్ వేసి సందడి చేశారు. అయితే.. ఒక తెలుగు సినిమా సాంగ్.. ప్రతిష్టాత్మక ఆస్కార్ వేడుకలో ఇలా ఇండియా మొత్తాన్ని గ్రాండ్ గా రిప్రెజెంట్ చేయడం అనేది గొప్ప విషయమనే చెప్పాలి. ఎందుకంటే.. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న విజువల్స్ లో చూస్తుంటే.. ఆస్కార్ స్టేజ్ పై ఓ గ్రూప్ నాటు నాటుకి పెర్ఫర్మ్ చేయడం మనం చూడవచ్చు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఆస్కార్ విజువల్స్ లో గమనిస్తే.. ఆర్ఆర్ఆర్ టీమ్ అందరూ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఆల్రెడీ సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ సైతం ఆస్కార్ స్టేజ్ పై పెర్ఫర్మ్ చేయడం.. కల నిజమైనట్లుగా ఉందని, ఎంతోమంది అభిమాన సినీ తారలను ఇలా కళ్లెదురుగుగా చూడటం, వాళ్ళను కలవడం గొప్పగా ఉందని చెప్పారు. అయితే.. ఇప్పటికే ఆస్కార్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. రాయల్ గా ముస్తాబైన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి బెస్ట్ సాంగ్ కేటగిరీ దగ్గరపడినా కొద్దీ తెలుగు వాళ్ళ గుండె వేగం పెరుగుతోంది. మరి 95వ ఆస్కార్ వేడుకలు మన నాటు నాటు సాంగ్ ఊపుతో మొదలవ్వడం ఎలా అనిపిస్తోంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#NaatuNaatu live performance at the Oscars Stage Got a massive response and a standing ovation.🌟✨🔥🙏#NaatuNaatuForOscars 💪😍 @RRRMovie pic.twitter.com/ePS5wfwSXo
— SumanTV (@SumanTvOfficial) March 13, 2023