ప్రభాస్ అభిమానులకు మరోసారి నిరాశ తప్పేట్లు లేదు. చాలాకాలంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాజాసాబ్ సినిమా విషయంలో బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఇదే ఇప్పుడు ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. అభిమానుల్ని అంతగా కలవరపెడుతున్న ఆ విషయమేంటో తెలుసుకుందాం.
టాలీవుడ్ హీరో ప్రభాస్ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. అయితే అన్నింటికంటే ముందుగా విడుదలకు సిద్ధమౌతున్న సినిమా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్. మాళవిక మోహనన్ ఈ సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇస్తోంది. ఆగస్టు 4వ తేదీన ఆమె పుట్టినరోజు సందర్భంగా సినీ నిర్మాతలు ప్రత్యేకమైన పోస్టర్ రిలీజ్ చేశారు. ఇదే ఇప్పుడు అభిమానుల్లో ఆందోళన రేపుతోంది. రాజాసాబ్ సినిమా విడుదల మరింత ఆలస్యం కావచ్చనే అనుమానాలు విన్పిస్తున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది డిసెంబర్ 5న విడుదల కావల్సి ఉంది. కానీ ఇప్పుడా పరిస్థితి కన్పించడం లేదు. వచ్చే ఏడాది అంటే 2026 జనవరిలో విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
అందుకే సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రభాస్ ఫ్యాన్స్ నిర్మాతలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. సినిమా విడుదల తేదీ ఎప్పుడనేది కచ్చితంగా చెప్పాలంటున్నారు. రాజాసాబ్ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడనే విషయంపై అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సందిగ్దత తొలగవచ్చని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సినిమా మరోసారి వాయిదా పడితే మాత్రం అభిమానులు తీవ్ర నిరాశ చెందవచ్చు. రాజాసాబ్ దేశవ్యాప్తంగా 5 భాషల్లో విడుదల కానుంది.
రాజాసాబ్ సినిమా వాయిదా పడటం వెనుక అంతర్గతంగా ఏ కారణాలు ఉన్నా..సంక్రాంతికి విడుదల చేస్తే మంచి కలెక్షన్లు రాబట్టవచ్చనే ఆలోచన కూడా ఉంది. అదే సమయంలో ఇతర పెద్ద హీరోల సినిమాలతో క్లాష్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవల్సి ఉంటుంది.