ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత హోదా ఉద్యోగాలు భర్తీ చేసే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం వివిధ సివిల్ సర్వీసులకు చెందిన 1105 ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 21, 2023లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 1105
విభాగాలు:
అర్హతలు: అభ్యర్ధులు ఏదైనా డిగ్రీ లేదాదానికి సమానమైన తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు కూడా అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి: 01-08-2023 నాటికి అభ్యర్థుల వయసు 21 ఏళ్లు నిండి ఉండాలి. అలాగే 32 ఏళ్లు మించకుండా ఉండాలి. అంటే 02-08-1991 నుంచి 01-08-2002 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష(ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తు ఫీజు: ఓబీసీ/ ఇతర అభ్యర్థులకు రూ.100(ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు).
ముఖ్యమైన తేదీలు
గమనిక: సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు రాసే అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యవిషయం.. అటెంప్టుల సంఖ్య. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే అపరిమితం. జనరల్‌కు 6, ఓబీసీలు, దివ్యాంగుల(జీఎల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ)కు 9 సార్లు మాత్రమే అవకాశం ఉంటుంది.