మీరు నిరుద్యోగులా..! పెద్ద పెద్ద చదువులు చదివి ఖాళీగా ఉంటున్నారా. అయితే, మీకో గుడ్ న్యూస్. హైదరాబాద్, ఉప్పల్ పరిధిలోని కేంద్రీయ విద్యాలయం వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 7,10న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి మరిన్ని వివరాలు కోసం కింద చదవండి.
నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్, ఉప్పల్ పరిధిలోని కేంద్రీయ విద్యాలయం వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టులను అనుసరించి బీఈడీ/ బ్యాచిలర్స్ డిగ్రీ/ డిప్లొమా/ బీఈ/బీఎస్సీ/ డీఈడీ/ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్ అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులను ఇంటర్య్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. మార్చి 07 నుంచి 10 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
మొత్తం ఖాళీలు: 9
విభాగాలు:
అర్హతలు: సంబంధిత పోస్టులను అనుసరించి బీఈడీ/ బ్యాచిలర్స్ డిగ్రీ/ డిప్లొమా/ బీఈ/బీఎస్సీ/ డీఈడీ/ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్ లో అర్హత సాధించి ఉండాలి
వయోపరిమితి: 18-65 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా
జీతభత్యాలు: నెలకు రూ.21250-రూ.27500
ఇంటర్వ్యూ నిర్వహించు ప్రదేశం: కేంద్రీయ విద్యాలయ -1, ఉప్పల్, హైదరాబాద్.
ఇంటర్వ్యూలు జరుగు తేది : మార్చి 7, 10 (ఉదయం 8.30 గంటలు)