ప్రభుత్వ ఉద్యోగం చేయాలని, పోలీస్ శాఖలో పని చేయాలని కలలు కనే వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ వంటి పలు పోస్టుల భర్తీ కోరుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 24,369 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో జనరల్ డ్యూటీ కానిస్టేబుల్, ఎస్ఎస్ఎఫ్, రైఫిల్ మేన్ వంటి పోస్టుల భర్తీకై దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా నోటిఫికేషన్ లో పేర్కొంది. ఓపెన్ కాంపిటీటివ్ ఎగ్జామ్ కండక్ట్ చేసి.. ఫలితాల్లో సత్తా చూపించిన వారిని రిక్రూట్ చేయనుంది. మరి ఈ పోస్టులకి కావాల్సిన అర్హతలు ఏమిటి? ఏ ఏ పోస్టుకి ఎంత జీతం? దరఖాస్తు ఎలా చేసుకోవాలి? పరీక్ష తేదీ ఇప్పుడు ఉంటుంది? అనే సమాచారం మీ కోసం.