ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ మరో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 5008 జూనియర్ అసోసియేట్స్ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. క్లరికల్ కేడర్ కింద ఈ దరఖాస్తులను స్వీకరిస్తోంది. దేశవ్యాప్తంగా వేర్వేరు సర్కిల్స్ లో 5008 జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టులకు సంబంధించిన అప్లికేషన్లను సెప్టెంబర్ 7 నుండి సెప్టెంబర్ 27 వరకూ దరఖాస్తులను తీసుకుంటుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఎస్బీఐ అఫీషియల్ వెబ్ సైట్ లో కరెంట్ ఓపెనింగ్స్ లోకి వెళ్లి అప్లై చేసుకోండి.
ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన అభ్యర్థులను మెయిన్ ఎగ్జామ్ కి పంపుతారు.