1961 మరియు అప్రెంటిస్ షిప్ రూల్స్ 1992 అప్రెంటిస్ యాక్ట్ కింద ఈస్టర్న్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీ కింద 2022-2023 సంవత్సరానికి గాను రైల్వే ‘రిక్రూట్మెంట్ సెల్’ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ రైల్వేస్ వెబ్ సైట్ లో దరఖాస్తుకు సంబంధించిన లింక్ అందుబాటులో ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయాలని, వేరే మార్గం లేదని ఆర్ఆర్సి వెల్లడించింది. రైల్వేకి సంబంధించిన అఫీషియల్ వెబ్ సైట్లో అప్లికేషన్ కి సంబంధించి ఆన్ లైన్ లింక్ సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 29,2022 వరకూ ఉంటుంది. ఈలోపు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.