8వ తరగతి పాసైన వారికి, ఇంటర్, ఐటీఐ పూర్తి చేసిన వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఐటీఐ సర్టిఫికెట్ ఉంటే కనుక ప్రభుత్వ ఉద్యోగం పొందే సువర్ణావకాశం మీదే. పాటియాలా లోకోమోటివ్ వర్క్స్, పాటియాలా 295 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పాటియాలా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ కింద పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్ట్ కి ఎలాంటి అర్హతలు కావాలో నోటిఫికేషన్ లో పేర్కొంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నవంబర్ 16లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా వెల్లడించింది. మరింకెందుకు ఆలస్యం ఈ పోస్టులకు కావాల్సిన అర్హతలేంటో తెలుసుకుని వెంటనే బెర్త్ కన్ఫర్మ్ చేసుకోండి.