ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు ఎల్ఐసీ శుభవార్త చెప్పింది. డిగ్రీ పూర్తి చేసి సరైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఆశావాదులకు ఎల్ఐసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తి చేసిన మీకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి ధీటుగా లక్షకు పైనే జీతం తీసుకునే అవకాశం ఎల్ఐసీ కలిపిస్తోంది. ఎల్ఐసీలో 300 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఎల్ఐసీ సూచించింది. ప్రస్తుత ఏడాది, బ్యాక్ లాగ్స్ లో కేటగిరీల వారీగా పోస్టులను కేటాయించింది. మరి దరఖాస్తు ఎలా చేసుకోవాలి? ఎప్పటిలోగా చేసుకోవాలి? పరీక్ష తేదీలు ఎప్పుడు? దరఖాస్తు ఫీజు ఎంత వంటి వివరాలు మీకోసం.