నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్ మెట్రో రైలులు కొన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని సంస్థ తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్హతకలిగిన అభ్యర్థులు అప్లయ్ చేసుకోవాలని తెలిపింది.
హైదరాబాద్ మెట్రో రైలు నిరుద్యోగులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో రైలులో కొన్ని ఉద్యోగాలకు ఖాళీలు ఉన్నాయని, అర్హత కలిగిన నిరుద్యోగులు వెంటనే అప్లయ్ చేసుకోవాలంటూ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్హతలు క్షుణ్ణంగా చదవాలని కూడా తెలిపింది. అసలు హైదరాబాద్ మెట్రో రైలులో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి? ఆ ఉద్యోగాలు ఏంటి? ఎలా అప్లయ్ చేసుకోవాలనే పూర్తి వివరాలు తెలసుకోవాలనుందా? అయితే ఈ వార్త చదవండి.
హైదరాబాద్ మెట్రో రైలులో ప్రస్తుతం 12 ఖాళీలు ఉన్నట్లుగా సంస్థ తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. అవి.. ఏఎంఎస్ ఆఫీసర్ (01), రోలింగ్ స్టాక్ టీమ్ టీడర్ (06), సిగ్నలింగ్ టీమ్ (02), ఐటీ ఆఫీసర్ (01), ట్రాక్స్ టీమ్ టీడర్ (02) వంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. అయితే మొత్తంగా 12 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా సంస్థ తెలిపింది. అయితే అప్లయ్ చేసుకునే అభ్యర్ధులు ముందుగా.. https://www.ltmetro.com/ లింక్ ఓపెన్ చేసి ఆయా పోస్టులకు దరాఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత దరఖాస్తు ఫామ్ ను KeolisHyd.Jobs@Keolishyderabad.com కి మెయిల్ చేయాలని సంస్థ ప్రకటనలో తెలిపింది.