కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేయడమే మీ లక్ష్యమా? అయితే.. అలాంటి సువర్ణావకాశం మీ ముందొచ్చింది. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్ పలు ఉద్యోగాల భర్తీలను చేపట్టనుంది. 01/2023 బ్యాచ్ కింద 03 సెప్టెంబర్ 2022 నాటి ఎంప్లాయ్ మెంట్ వార్తాపత్రికలో నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్), మెకానికల్ (డొమెస్టిక్ బ్రాంచ్) కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 8 నుండి సెప్టెంబర్ 22 వరకు కొనసాగుతుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు: మొత్తం పోస్టులు – 322
జీతభత్యాలు:
అర్హతలు:
వయో పరిమితి: 18 నుండి 22 సంవత్సరాలు
దరఖాస్తు ప్రారంభ తేదీ: 8 సెప్టెంబర్ 2022
దరఖాస్తు చివరి తేదీ: 22 సెప్టెంబర్ 2022
పరీక్ష తేదీ: నవంబర్ 2022
ఎంపిక ప్రక్రియ:
దరఖాస్తు చేసే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ పత్రాలను సమర్పించాలి. అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు బోర్డులు/ విశ్వవిద్యాలయాలు/ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇండియన్ కోస్ట్ గార్డ్ ద్వారా ధృవీకరించబడతాయి. సంబంధిత బోర్డులు/ విశ్వవిద్యాలయాలు/ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పత్రాలు అసలైనవి కాదు.. అని నివేదించినట్లయితే, అభ్యర్థులు సంబంధిత ఉద్యోగాల నుంచి తొలగించబడతారు.
దరఖాస్తు ప్రక్రియ:
అభ్యర్థులు తమ ఈ-మెయిల్ ఐడి/మొబైల్ నంబర్‌ని ఉపయోగించి joinindiancoastguard.cdac.inలో నమోదు చేసుకోవాలి. ఒక అభ్యర్థి ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.