మీరు ఇంటర్ చేశారా? డేటా ఎంట్రీలో మీకు మంచి ప్రావీణ్యం ఉందా? డేటా ఎంట్రీ జాబ్ కోసం ఎదురుచూసీ చూసీ విసిగి చెందారా? ఆన్ లైన్ లో నకిలీ డేటా ఎంట్రీ పోస్టులను చూసి విసిగిపోయారా? డేటా ఎంట్రీ జాబ్స్ అని చాలా మంది సోషల్ మీడియాలో, సెల్ ఫోన్ మెసేజెస్ లోనూ అనేక ప్రకటనలు చూసే ఉంటారు. తీరా అవతలి వ్యక్తిని కాంటాక్ట్ అయితే.. రిజిస్ట్రేషన్ ఫీజు అని, ప్రాజెక్ట్ మీకు ఇవ్వాలంటే డబ్బులు కట్టాలని కబుర్లు చెప్తారు. తీరా కట్టాక అస్సామే. ఈ మధ్య కొంతమంది ఇంకా తెలివి మీరిపోయారు. రిజిస్ట్రేషన్ అవసరం లేదు అని చెప్పి ముందు వర్క్ ఇచ్చి, పని ఫినిష్ చేసిన తర్వాత డబ్బులు కట్టాలి అని కబుర్లు చెప్తారు. ఇదో పెద్ద దండుపాళ్యం బ్యాచ్ అని చెప్పి లైట్ తీసుకుంటాం. కానీ చేసిన వర్క్ మర్చిపోలేంగా.
ఇలాంటి పరిస్థితుల్లో డేటా ఎంట్రీ అనే ఆప్షన్ నే మొత్తానికి తీసి పడేయాలి అని అనిపిస్తుంది. అసలు డేటా ఎంట్రీ జాబ్స్ ఈరోజుల్లో ఉంటాయా అని సందేహం వస్తుంది. కానీ కంగారు పడకండి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో డేటా ఎంట్రీ జాబ్స్ పడ్డాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకి చెందిన బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) డేటా ఎంట్రీ ఆపరేటర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఢిల్లీలోని ప్రభుత్వ ఆస్పత్రిలో డేటా ఎంట్రీ ఆపరేటర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. సంస్థకు చెందిన అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 26 లోపు దరఖాస్తు చేసుకోవాలి. మరి మీకు నచ్చిన ఉద్యోగానికి అప్లై చేయడానికి కనీస అర్హతలు ఏమిటి? ఎలా అప్లై చేసుకోవాలి? జీతం ఎంత ఇస్తారు? ఎన్ని ఖాళీలు ఉన్నాయి? వంటి వివరాలు మీ కోసం.