ఇప్పటికే గ్రూప్ 1 సర్వీసెస్ కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ తాజాగా మరో రెండు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఫారెస్ట్ సర్వీస్ మరియు ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబ్ ఆర్డినేట్ సర్వీస్ లో పలు ఖాళీలను భర్తీ కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ మరియు కంప్యూటర్ డ్రాట్స్ మేన్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొంది. క్యారీడ్ ఫార్వార్డ్ మరియు తాజా ఖాళీలను నియామకం కోరుతూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జిల్లాల వారిగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి? కంప్యూటర్ డ్రాట్స్ మేన్ ఖాళీలు ఎన్ని ఉన్నాయి? జీతం ఎంత? అర్హతలు ఏంటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి వివరాలు మీ కోసం.