బ్యాంకు ఉద్యోగం కొట్టాలనేది చాలా మంది యువకుల కల. అందులోనూ ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం చేయాలని ఎన్నో ఏళ్ల నుంచి కలలు కంటూ ఉంటారు. మరి ఆ కలలను నిజం చేసుకునే అవకాశం ఈరోజు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయవాడలో ఉన్న ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంకుకి సంబంధించిన శాఖల్లో.. కో-ఆపరేటివ్ క్రెడిట్ స్ట్రక్చర్ కొరకు బ్రాండ్ మేనేజర్/అడ్మినిస్ట్రేటర్ కమ్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 1 నుంచి మొదలైంది. మరి ఈ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలి? చివరి తేదీ ఎప్పుడు? పోస్టులకు కావాల్సిన అర్హతలు మొదలైన విషయాలు మీ కోసం.