పాపం సన్ రైజర్స్. అసలే మ్యాచ్ ఓడిపోయి బాధలో ఉంటే ఇప్పుడు ఇంకో షాక్ తగిలింది. అదే టైంలో బీసీసీఐ కూడా సీరియస్ అయింది. SRH బ్యాటర్ కు జరిమానా విధించింది.
సన్ రైజర్స్ హైదరాబాద్.. ఈ సీజన్ లో చాలా అంచనాలతో బరిలోకి దిగింది. కోట్లు పెట్టి కొన్న ప్లేయర్స్ కేక పుట్టించే ఇన్నింగ్స్ లు ఆడతారని ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. అదంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది. చెప్పాలంటే రూ.13 కోట్లు పెట్టి కొన్న ఆ హ్యారీ బ్రూక్ అయితే ఒకటి రెండు మ్యాచ్ లో మినహా ఘోరంగా అంటే ఘోరంగా ఆడాడు. తాజాగా లక్నో ఓడిపోయి ఎలిమినేట్ అయిపోయిన సన్ రైజర్స్ మరో పెద్ద షాక్ తగిలింది. బీసీసీఐ ఈ జట్టులోని ప్లేయర్ల ఆటతీరుపై ఫుల్ సీరియస్ అయింది. ఇంతకీ ఏంటి విషయం?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈసారి ఐపీఎల్ సన్ రైజర్స్ కి అస్సలు కలిసి రాలేదు. ఒకటి రెండు మ్యాచుల్లో గెలిచి కాస్త ఆశ రేపింది కానీ జట్టులో ఏ ఒక్క ప్లేయర్ కూడా సీరియస్ ఆడిన దాఖలాలు కనిపించలేదు. బయట గ్రౌండ్స్ లో ఓడిపోయారంటే సరేలే అనుకోవచ్చు. సొంత మైదానం ఉప్పల్ లోనే ఘోర ఓటముల్ని అందుకున్నారు. తాజాగా జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 182/6 స్కోరు చేసింది. ఛేదనలో లక్నో.. 19.2 ఓవర్లలో 185/3 స్కోరు చేసి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ తరఫున క్లాసెన్ ఒక్కడే బాగా బ్యాటింగ్ చేశారు. ఇప్పుడు ఆ క్రికెటరే వివాదంలోనూ చిక్కుకున్నాడు.
సన్ రైజర్స్ బ్యాటింగ్. 19వ ఓవర్ ఆవేష్ ఖాన్ వేశాడు. మూడో బంతి హైఫుల్ టాస్ గా వెళ్లింది. దీంతో ఫీల్డ్ అంపైర్ నోబాల్ ప్రకటించాడు. లక్నో కెప్టెన్ దీన్ని ఛాలెంజ్ చేస్తూ రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో థర్డ్ అంపైర్.. బంతి క్లియర్ గా ఉందని, నో బాల్ కాదని చెప్పాడు. నడుము పై నుంచి బంతి వెళ్లినా, నో బాల్ ఇవ్వకపోవడంపై క్రీజులో ఉన్న సమద్, క్లాసెన్ తో ఫ్యాన్స్ షాకయ్యారు. ఈ క్రమంలోనే క్లాసెన్ అంపైర్ తో గొడవకు దిగాడు. ‘అసలు ఇదేం అంపైరింగ్’ అనేలా కామెంట్స్ చేశాడు. దీనిపై ఇప్పుడు బీసీసీఐ సీరియస్ అయింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ 2.7 ఆర్టికల్ 1 ప్రకారం మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది. అసలే మ్యాచ్ ఓడి పరువు పోగొట్టుకున్న సన్ రైజర్స్ ఇది మరో షాక్ అనే చెప్పాలి. మరి ఈ ఇష్యూపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.