ఐపీఎల్ 2023 లో ఆర్సీబీ- లక్నో జట్ల మధ్య మ్యాచులు ఏ రేంజ్ లో జరిగాయో మనకు తెలిసిందే. అయితే ఈ రెండు జట్లు మరో సారి ప్లే అఫ్ లో తలపడే అవకాశం ఉంది. మరి ఇలా జరగాలంటే?
ఐపీఎల్ 2023 సీజన్ ముగింపు దశకు వచ్చేసింది. ఈ ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగే మ్యాచ్ తో ఈ సీజన్ లీగ్ మ్యాచులు ముగిసిపోతాయి. ఇప్పటికే ప్లే ఆఫ్ కి గుజరాత్ అర్హత సాధించగా.. మిగిలిన మూడు బెర్తులు కోసం 6 జట్లు రేస్ లో ఉన్నాయి. వీటిలో కేకేఆర్, పంజాబ్, రాజస్థాన్ జట్లు దాదాపు ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించగా.. చెన్నై, బెంగళూరు, లక్నో, ముంబై మిగిలిన మూడు బెర్తుల కోసం విపరీతంగా పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ జట్లు ప్లే ఆఫ్ కి వెళ్తాయో మరింత ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఆర్సీబీ- లక్నో మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారని అర్ధం అవుతుంది.
ఐపీఎల్ 2023 లో ఆర్సీబీ- లక్నో జట్ల మధ్య మ్యాచులు ఏ రేంజ్ లో జరిగాయో మనకు తెలిసిందే. ఐపీఎల్ లో ఈ రెండు జట్లు ఇండియా-పాకిస్థాన్ జట్లను తలపించాయి. లీగ్ దశలో వీరిద్దరి మధ్య జరిగిన మొదటి మ్యాచులో చివర్లో హర్షల్ పటేల్ మాన్కడింగ్ చేయడంలో విఫలం కావడంతో బైస్ రూపంలో పరుగు పూర్తి చేయడంతో లక్నో విజయం సాధించింది. దీంతో ఆవేశ ఖాన్ హెల్మెట్ కింద వేసి మరీ కాస్త అతిగా ప్రవర్తించాడు. మెంటార్ గా ఉంటున్న గంభీర్ కూడా బెంగళూరు ఫ్యాన్స్ వైపుగా చూస్తూ అరవద్దు గెలిచింది మేమే అన్నట్లుగా సైగ చేసాడు. ఇక ఈ రెండు జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచులో లో స్కోరింగ్ మ్యాచులో బెంగళూరు సంచలన విజయం సాధించింది. దీంతో కోహ్లీ సెలెబ్రేషన్స్, నవీన్- కోహ్లీ మధ్య గొడవ.. కోహ్లీ-గంభీర్ మధ్య గొడవ ఎలా జరిగిందో మనకి తెలిసిందే.
లీగ్ దశలో జరిగిన ఈ రెండు మ్యాచులు ఒక చిన్న వార్ నే సృష్టించాయి. అయితే ఈ రెండు జట్లు మరో సారి ప్లే అఫ్ లో తలపడే అవకాశం ఉంది. ఇలా జరగాలంటే ఆర్సీబీ తన చివరి రెండు మ్యాచుల్లో గెలిచి తీరాలి. అదే సమయంలో ముంబై ఇండియన్స్ తన చివరి మ్యాచులో సన్ రైజర్స్ మీద ఓడిపోవాలి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీతో తలపడబోయే చివరి మ్యాచులో ఖచ్చితంగా గెలిచి తీరడంతో పాటు లక్నో తాను కేకేఆర్ తో ఆడబోయే చివరి మ్యాచులో కూడా ఓడిపోవాలి. ఈ సమీకరణాలు అన్ని జరిగితే ఈ రెండు జట్ల మధ్య మరోసారి మ్యాచ్ చూడవచ్చు. అభిమానులు కూడా మరోసారి ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే ప్రతీకారం తీర్చుకునే అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు. మరి ఈ సమీకరణాలు జరుగుతాయో? లేదో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.