ఐపీఎల్ 2023 చివరి దశకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ కి వెళ్లే నాలుగు జట్లు ఇంకా ఖరారవ్వకపోవడం గమనార్హం. నిన్న సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచులో గుజరాత్ ప్లే ఆఫ్ బెర్త్ ని కన్ఫర్మ్ చేసుకోగా.. మిగిలిన మూడు బెర్తుల కోసం 7 టీమ్స్ రేస్ లో ఉన్నాయి. మరి వీటి ప్లే ఆఫ్ అవకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ఐపీఎల్ 2023 చివరి దశకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ కి వెళ్లే నాలుగు జట్లు ఇంకా ఖరారవ్వకపోవడం గమనార్హం. నిన్న సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచులో గుజరాత్ ప్లే ఆఫ్ బెర్త్ ని కన్ఫర్మ్ చేసుకోగా.. మిగిలిన మూడు బెర్తుల కోసం 7 టీమ్స్ రేస్ లో ఉన్నాయి. మరి వీటి ప్లే ఆఫ్ అవకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
చెన్నై సూపర్ కింగ్స్: ప్రస్తుతం 13 మ్యాచులో 15 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ మ్యాచ్ లో సూపర్ కింగ్స్ విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా ప్లే ఆఫ్ కి వెళ్తుంది. ఇక ఈ మ్యాచులో ఓడిపోయినా చెన్నై ప్లే ఆఫ్ కి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ అది ఇతర జట్ల ఫలితాల మీద ఆధారపడి ఉంది. ఆర్సీబీ, పంజాబ్, లక్నో జట్లలో కనీసం రెండు జట్లు తమ చివరి రెండు మ్యాచుల్లో కనీసం ఒక్కో మ్యాచ్ ఓడిపోతే.. చెన్నై చివరి మ్యాచ్ గెలవకపోయినా ప్లే ఆఫ్ కి వెళ్తుంది.
ముంబై ఇండియన్స్: ప్రస్తుతం 14 పాయింట్లు ఉన్న ముంబై జట్టుకి ప్లే ఆఫ్ కి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తర్వాత జరగబోయే రెండు మ్యాచుల్లో గెలిస్తే..ప్లే ఆఫ్ తో పాటు టాప్ 2 లో కూడా నిలిచే అవకాశం ఉంటుంది. ఇక ఒక మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే పంజాబ్, ఆర్సీబీ, చెన్నై, లక్నో జట్లలో ఏవైనా రెండు జట్లు కనీసం ఒక్క మ్యాచులోనైనా ఓడిపోవాలి.
లక్నో సూపర్ జయింట్స్: మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ కంఫర్మ్ చేసుకుంటుంది. అలా కాకుండా ఒకే మ్యాచులో గెలిస్తే ఇతర జట్ల ఫలితాల మీద ఆధారపడాల్సి ఉంటుంది. పంజాబ్, బెంగళూరు జట్లు కూడా మిగిలిన రెండు మ్యాచుల్లో ఒక్క మ్యాచ్ ఓడిపోవాలి. ఒకవేళ రెండు మ్యాచులు ఓడిపోతే బ్యాగులు సర్దుకోవాల్సిందే.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: నెట్ రన్ రేట్ బాగుండడంతో బెంగళూరు జట్టు మిగిలిన రెండు మ్యాచులను ఖచ్చితంగా గెలిస్తేనే ప్లే ఆఫ్ కి వెళ్తుంది. ఒక్కటి ఓడిపోయినా ప్లే ఆఫ్ వెళ్లొచ్చు కానీ అలా జరగాలంటే అద్భుతం జరగాలి. లక్నో, ముంబై, పంజాబ్ తమ చివరి రెండు మ్యాచుల్లో ఓడిపోవాలి. ఇది జరిగే పని కాదు కాబట్టి తమ చివరి రెండు మ్యాచుల్లో ఆర్సీబీ గెలిచి తీరాల్సిందే.
పంజాబ్ కింగ్స్: ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న పంజాబ్..రన్ రేట్ దారుణంగా ఉండడంతో చివరి రెండు మ్యాచుల్లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి. అయినా కూడా ఇతర మ్యాచ్ ఫలితాల మీద ఆధారపడాల్సి వస్తుంది.ముంబై, ఆర్సీబీ, చెన్నై, లక్నో నాలుగు జట్లలో కనీసం రెండు జట్లు ఒక్క మ్యాచులోనైనా ఓడిపోవాలి. ఒకవేళ ఒక దాంట్లో మాత్రమే గెలిస్తే 14 పాయింట్లు ఉన్నా.. నెట్ రన్ రేట్ బాగా తక్కువగా ఉండడంతో ప్లే ఆఫ్ కి వెళ్లడం దాదాపు అసాధ్యం.
ఇక రాజస్థాన్, కోల్ కత్తా ప్లే ఆఫ్ కి వెళ్లడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తుంది. ఏదైనా.. మహాద్భుతం జరిగితే తప్ప వీరు ప్లే ఆఫ్ కి వెళ్ళలేరు. ముందు ఈ రెండు జట్లు కూడా తమ చివరి మ్యాచులో గెలిచి.. ఆ తర్వాత ఇతర జట్ల ఫలితాల మీద ఆధారపడాలి. బెంగళూరు, పంజాబ్ తమ చివరి రెండు మ్యాచుల్లో ఓడిపోవాలి. ముంబై, లక్నో లో ఏదో ఒక టీమ్ రెండు మ్యాచులు ఓడిపోవాలి. అదే విధంగా తమ చివరి మ్యాచ్ ని భారీ తేడాతో గెలవాలి. రాజస్థాన్ కి కొంచెం మెరుగైన రన్ రేట్ ఉండడంతో కోల్ కత్తా తో పోలిస్తే కాస్త మెరుగైన అవకాశాలున్నాయి. మరి ఈ 7 జట్లలో ప్లే ఆఫ్ కి ఏ జట్లు వెళతాయో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.