ఐపీఎల్ 2023 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పరిస్థితి ఆగమ్యగోచరంగా తయ్యారు అయ్యింది. ఇప్పటికే వరుస ఓటములు పలకరిస్తున్న నేపథ్యంలో మరో ఊహించని షాక్ తగిలింది.
ఐపీఎల్ 2023 సీజన్ జోరుగా కొనసాగుతోంది. ప్రతి మ్యాచ్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూనే ఉంది. ఇక ఈ సీజన్ లో దురదృష్టమైన జట్టు ఏదైనా ఉంది అంటే ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ అనే చెప్పాలి. ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే కెప్టెన్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురికావడంతో.. ఢిల్లీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇక ఈ ఏడాది సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్ ల్లోనూ ఓడిపోయింది. దాంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. తన నెక్ట్స్ మ్యాచ్ ఏప్రిల్ 20న కేకేఆర్ టీమ్ తో తలపడనుంది. ఇక ఈ మ్యాచ్ లోనైనా గెలిచి బోణీ కొట్టాలని భావిస్తున్న ఢిల్లీ టీమ్ కు ఊహించని షాక్ తగిలింది.
‘మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లుగా’ తయ్యారు అయ్యింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పరిస్థితి. ఇప్పటికే వరుస ఓటముల నుంచి ఎలా గట్టెక్కాలో తెలియకుండా ఉన్న ఢిల్లీ టీమ్ కు ఊహించని షాక్ ఇచ్చారు దొంగలు. అసలు విషయం ఏంటంటే? ఢిల్లీ ఆటగాళ్ల క్రికెట్ కిట్ లు చోరీకి గురయ్యాయి. ఆటగాళ్ల బ్యాట్లు, ఆర్మ్ ప్యాడ్స్, థై ప్యాడ్స్, షూస్, గ్లోవ్స్ లాంటి ఇతర విలువైన వస్తువులను దొంగలించబడ్డాయి. కోల్ కత్తా తో మ్యాచ్ కోసం ఢిల్లీ జట్టు బెంగళూరు నుంచి డైరెక్ట్ గా ఆదివారం(ఏప్రిల్ 16)న ఢిల్లీకి చేరుకుంది. అయితే ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాక తమ కిట్లు కనిపించకుండా పోయినట్లు ఆటగాళ్లు గుర్తించారు.
ఇక చోరీకి గురైన వస్తువుల్లో 16 బ్యాట్లు, షూస్, ప్యాడ్ లు, గ్లోవ్స్ లాంటి మరిన్ని విలువైన వస్తువులు ఉన్నాయి. ఈ వస్తువుల్లో మూడు బ్యాట్లు వార్నర్ వి కాగా, రెండు బ్యాట్లు మిచెల్ మార్ష్ వి. యష్ ధుల్ కు చెందిన 5 బ్యాట్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ విషయంపై ఢిల్లీ ఫ్రాంఛైజీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఈ సంఘటన గురించి ఢిల్లీ క్యాపిటల్స్ కు చెందిన ఓ వ్యక్తి ఈ విధంగా మాట్లాడాడు.”మా టీమ్ లో ప్రతి ఒక్క ఆటగాడు ఏదో ఒక వస్తువును పోగొట్టుకున్నాడు. ఇలాంటి సంఘటన జరగడం ఇదే మెుదటి సారి. మేము ఈ విషయంపై ఎయిర్ పోర్ట్ లాజిస్టిక్స్ విభాగానికి, పోలీసులకు ఫిర్యాదు చేశాం” అని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే వరుస ఓటముల్లో మునిగి ఉన్న ఢిల్లీ టీమ్ కు ఊహించని షాక్ ఇచ్చారు చోరులు.
16 bats along with pads, shoes, thigh pads and gloves were stolen from Delhi Capitals’ players kit bags. 3 bats belong to David Warner, 2 of Mitchell Marsh, 3 of Phil Salt and 5 of Yash Dhull. (Reported by Indian Express).
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 19, 2023