దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది. రెగ్యులర్ కెప్టెన్ పంత్ యాక్సిడెంట్ లో గాయపడటంతో జట్టులో ఉన్న స్టార్ క్రికెటర్ కు సారథ్య బాధ్యతలు అప్పగించారట.
ఐపీఎల్ సందడి అప్పుడే మొదలైపోయింది. ఓ వారం క్రితం కొత్త సీజన్ షెడ్యూల్ ప్రకటించారు. మార్చి 31 నుంచి సీజన్ స్టార్ట్ కానుందని, తొలి మ్యాచ్ చెన్నై-గుజరాత్ జట్ల మధ్య ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. దాదాపు 70 మ్యాచుల షెడ్యూల్ ని రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే ఫ్రాంచైజీలన్నీ కూడా ఫుల్ బిజీగా ఉన్నాయి. తాజాగా సన్ రైజర్స్ జట్టు కెప్టెన్ గా మార్క్రమ్ ని ఫిక్స్ చేసింది. ఇప్పుడు దిల్లీ క్యాపిటల్స్ కూడా తమ జట్టుకు కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్ ని ప్రకటించేసినట్లు తెలుస్తోంది. ఇది సమాచారమే అయినప్పటికీ దాదాపు ఇది కన్ఫర్మ్ అని సమాచారం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. గత కొన్నేళ్లలో ఐపీఎల్ లో గేమ్, క్రేజ్ పరంగా గుర్తింపు తెచ్చుకున్న జట్టు దిల్లీ క్యాపిటల్స్. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా ఉన్నప్పుడు విజయాలతో దూసుకుపోయిన ఈ జట్టు.. యంగ్ క్రికెటర్ రిషభ్ పంత్ కెప్టెన్ అయిన తర్వాత ఆ సక్సెస్ ని కొనసాగిస్తూ వచ్చింది. అయితే జట్టంతా బలంగా ఉన్నప్పటికీ.. కప్ కొట్టడంలో మాత్రం ఎందుకో తడబడుతూ వస్తోంది. ఈసారి ఎలాగైనా సరే ట్రోఫీ గెలవాల్సిందే అని పట్టుదలగా ఉన్న దిల్లీకి పంత్ యాక్సిడెంట్ రూపంలో షాక్ తగిలింది. దీంతో నెక్స్ట్ కెప్టెన్ ఎవరా? అని అటు ఫ్యాన్స్, ఇటు క్రికెట్ ప్రేమికులు తెగ ఎదురుచూశారు.
రీసెంట్ గా న్యూయర్ టైంలో కారు యాక్సిడెంట్ లో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడు కోలుకోవడానికి దాదాపు 6-8 నెలలు పడుతుంది. దీంతో దిల్లీ జట్టులో ఉన్న వార్నర్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారని, స్పిన్నర్ అక్షర్ పటేల్ కు వైస్ కెప్టెన్సీ ఇచ్చారని తెలుస్తోంది. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే వార్నర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఎందుకంటే 2016లో కెప్టెన్ గా వార్నర్ ఉన్న టైంలో హైదరాబాద్ జట్టు కప్ కొట్టింది. దీంతో ఈసారి దిల్లీ క్యాపిటల్స్ కూడా సేమ్ సీన్ రిపీట్ చేయడం గ్యారంటీ అని మాట్లాడుకుంటున్నారు. మరి దిల్లీ జట్టుకు వార్నర్ నెక్స్ట్ కెప్టెన్ అనే కామెంట్స్ పై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
David Warner will be the captain & Axar Patel will be the vice-captain of Delhi in IPL. (Source – Cricbuzz)
— Johns. (@CricCrazyJohns) February 23, 2023