Riyan Parag, IPL 2023: ఐపీఎల్‌లో యంగ్ యాటిట్యూడ్ స్టార్ ఎవరంటే వినిపించే సమాధానం రియాన్ పరాగ్. ఈ యువ క్రికెటర్ కెరీర్ ఆరంభంలోనే యాటిట్యూడ్ చూపిస్తున్నాడంటూ చెడ్డ పేరును పొందాడు. తాజాగా ఐపీఎల్ 2023లో బ్యాడ్ ఫామ్‌తో అభిమానుల ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ యువ క్రికెటర్ రియాన్ పరాగ్ జాతీయ జట్టుకు ఆడకపోయినా ఐపీఎల్‌తో అందరికీ సుపరిచితమే. అయితే.. ఐపీఎల్‌లో అదరగొట్టినందుకు అతను ఫేమస్ కాలేదు. యాటిట్యూడ్ వల్ల అయ్యాడు. అతి చేయమంటే.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతనికే వస్తుంది. కానీ, ఆటలో మాత్రం ఒకటీ రెండు మ్యాచ్‌లు తప్పించి పెద్దగా ఆడిందేం లేదు. అయినా కూడా రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో అతనికి చోటు దక్కుతుంది. వచ్చిన అవకాశాలను పదే పదే సర్వనాశనం చేసుకుంటున్న పరాగ్.. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ దారుణంగా విఫలం అయ్యాడు. 11 బంతులాడిన పరాగ్ కేవలం 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
అది కూడా ఒక భారీ షాట్ ఆడబోయి లైన్ మిస్ అయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ అవుట్ తర్వాత పరాగ్‌పై సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతోంది. ఆట తక్కువ అతి ఎక్కువ అంటూ పరాగ్‌పై క్రికెట్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఐపీఎల్ గత సీజన్‌లో ఆర్సీబీ ప్లేయర్ హర్షల్ పటేల్‌తోనూ పరాగ్ గొడవకు దిగి.. విమర్శల పాలయ్యాడు. అయితే.. ఈ సీజన్‌కు ముందు ధోని కంటే అద్భుతంగా పవర్ హిట్టింగ్ చేసి.. బెస్ట్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకుంటానని సైతం భారీ స్టేట్‌మెంట్లు ఇచ్చాడు. కానీ, తీరా బరిలోకి దిగిన తర్వాత.. చెత్త బ్యాటింగ్‌తో విమర్శల పాలవుతున్నాడు.
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 50 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న పరాగ్.. 40 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌కు దిగాడు. ఈ 40 ఇన్నింగ్స్‌లో అతను చేసిన పరుగులు కేవలం 565 పరుగులు మాత్రమే. అతని బ్యాటింగ్ యావరేజ్ 16.35. కేవలం రెండు సార్లు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ గణంకాలు చూస్తే.. పరాగ్ బ్యాటర్‌గా ఎంత ఫ్లాప్ ఆడగాడో అర్థమవుతుంది. కానీ.. రాజస్థాన్ జట్టులో యువ క్రికెటర్ల లోటుతో అతనికి మిడిల్డార్‌లో చోటు దక్కుతోంది. మరి పరాగ్ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Riyan Parag in IPL:
50 – Mat
40 – Inns
565 – runs
16.35 – Avg
124.38 – SR
2-50s— CricTracker (@Cricketracker) April 8, 2023
Yet another failure for Riyan Parag with the bat.
RR lose their third wicket for 126 runs.
📸: Jio Cinema pic.twitter.com/ZD9HcO31Vp
— CricTracker (@Cricketracker) April 8, 2023
Riyan Parag in today’s match be like 😅#RRvsDC #IPL2023 pic.twitter.com/RXE6gGpG4Q
— Ashutosh Srivastava 🇮🇳 (@sri_ashutosh08) April 8, 2023
2019: He is young. Give him time
2020: He is young. Give him time
2021: He is young. Give him time
2022: He is young. Give him time
2023: He is young. Give him time
Riyan Parag has played 50 matches for RR..#RRvsDC pic.twitter.com/BOlo7uMOkt— The Cricket Statistician (@CricketSatire) April 8, 2023