ఐపీఎల్ 2022లో అదరగొడుతున్న స్టార్ ఆటగాడు షిమ్రోన్ హెట్‌మేయిర్ తండ్రయ్యాడు. అతని భార్య నిర్వాణి.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారంటూ హెట్‌మేయిర్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. బిడ్డను ఎత్తుకుని ముద్దాడుతున్న ఈ వీడియో క్లిప్పింగ్.. క్షణాల్లో వైరల్‌గా మారింది. వేలాది మంది అభిమానులు హెట్‌మేయిర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న హెట్‌మేయిర్.. సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లను ఆడిన హెట్‌మేయిర్ ఏడుసార్లు నాటౌట్‌గా నిలిచాడు. 291 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి.
భార్య నిర్వాణికి నెలలు నిండటంతో రెండు రోజుల కిందటే తన స్వదేశం గయానాకు బయలుదేరి వెళ్లాడు. ఈ తెల్లవారు జామున గయానా కంబర్లాండ్‌లోని స్థానిక ఆసుపత్రిలో నిర్వాణి ప్రసవించింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మళ్లీ హెట్‌మేయిర్ భారత్‌కు తిరుగు ప్రయాణమవుతాడు. రాజస్థాన్ రాయల్స్ ఆడే తరువాతి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు. బిడ్డ పుట్టిన ఆనందంలో హెట్‌మేయిర్ ఐపీఎల్‌కు తిరిగొచ్చి మరింత చెలరేగి ఆడతాడని అభిమానులు సరదాగా వ్యాఖ్యనిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Ajinkya Rahane: డిఫరెంట్‌గా ట్రై చేసిన రహానే! సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం
Many congratulations to Shimron Hetmyer on becoming a father. pic.twitter.com/BwoLpsNcbs
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.