ఐపీఎల్ 2022 సీజన్ అట్టహాసంగా ముగిసింది. కొత్త ఫ్రాంచైజ్ గుజరాత్ టైటాన్స్ టైటిల్ విన్నర్ గా నిలవగా.. రాజస్థాన్ రాయల్స్ రన్నరప్ గా నిలిచింది. ఫైనల్ వరకూ అద్భుతమైన ప్రదర్శన చేసిన రాజస్థాన్ మాత్రం.. కీలక మ్యాచ్ లో చేతులెత్తేసింది. లీగ్ దశ నుంచి మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతూ వచ్చిన గుజరాత్ అందరూ అకున్నట్లుగానే టైటిల్ విజేతగా నిలిచింది. ఫిట్ నెస్ పై అనుమానాలతో హార్దిక్ పాండ్యాను రిటైన్ చేసుకోకుండా ముంబై వదిలేస్తే.. గుజరాత్ కు కెప్టెన్ గా వచ్చి టైటిల్ తన్నుకుపోయాడు. మరోవైపు ఈ సీజన్ లో ముంబై, చెన్నై జట్లు అత్యంత దారుణమైన ప్రదర్శనతో టేబుల్ లో ఆఖరి స్థానాలతో సరిపెట్టుకున్నారు.
ప్రస్తుతం అందరూ టైటిల్ విన్నర్, రన్నర్ లకు ఎంత దక్కింది? ఎవరికి ఎంత ముట్టజెప్పారు అనే వెతుకులాట మొదలు పెట్టారు. అయితే ఈసారి టైటిల్ విన్నర్ కు రూ.20 కోట్లు ప్రైజ్ మనీ దక్కింది. మ్యాచ్ తర్వాత ఆ చెక్కును గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు అందజేశారు. అంతేకాకుండా రన్నరప్ గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ కు రూ.12.5 కోట్లు చెక్కును ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ కు అందజేశారు.
ఇంక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. జోస్ బట్లర్(35 బంతుల్లో 5 ఫోర్లతో 39) మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో హార్థిక్ మూడు వికెట్లు తీయగా.. సాయి కిషోర్ 2 వికెట్లు పడగొట్టాడు. షమీ, యశ్ దయాల్, రషీద్ తలో వికెట్ తీశారు.
The glorious night of all…✨
We dare you to not watch this on loop 🤩🏆💙#SeasonOfFirsts #AavaDe #IPLFinal
[🎵: Lehraa Do | Arijit Singh | 83] pic.twitter.com/nEo4BusOs5
— Gujarat Titans (@gujarat_titans) May 30, 2022
అనంతరం స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి గెలుపొందింది. శుభ్‌మన్ గిల్(43 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్ తో 45 నాటౌట్), డేవిడ్ మిల్లర్(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్ తో 32 నాటౌట్), హార్థిక్ పాండ్యా(30 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్ తో 34) రాణించారు. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2022 సీజన్లో రాణించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Let’s ꜱᴀᴠᴇ this forever, #TitansFAM! 💙pic.twitter.com/66X3QqQXH7
— Gujarat Titans (@gujarat_titans) May 29, 2022
“𝐖𝐇𝐀𝐓 𝐄𝐋𝐒𝐄 𝐖𝐄 𝐇𝐄𝐑𝐄 𝐅𝐎𝐑?” 😀 https://t.co/uyUKUHA6QZ
— Gujarat Titans (@gujarat_titans) May 29, 2022
A wicket of the first and the last ball 🔥… A beautiful coincidence borne out of belief, skill and execution 💪
Iss final ki ajab kahani, gazab Shami bhai ki zubaani 🤩#IPLFinal #GTvRR #AavaDe pic.twitter.com/kdpzsqR72N
— Gujarat Titans (@gujarat_titans) May 30, 2022