ఐపీఎల్ 2022 సీజన్‌లో సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ను బెంచ్‌కే పరిమితం చేయడంపై ముంబై ఇండియన్స్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ‘అవకాశం ఇవ్వనప్పుడు కొనడం ఎందుకు’.. అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై క్రికెట్ దిగ్గజం స్పందించాడు. జట్టు ఎంపికలో తన ప్రమేయం ఉండదని చెప్పిన సచిన్.. సలహాలు ఇవ్వడం మాత్రమే చేస్తానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సచిన్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మెగా వేలంలో అర్జున్ టెండూల్కర్ ను రూ. 30 లక్షలకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఈ సీజన్ లో ముంబై ఆటతీరు పేలవంగా సాగగా.. తుది జట్టు విషయంలో మ్యాచ్ మ్యాచ్ కు పలు మార్పులు చేసింది. దాంతో అర్జున్ కు తుది జట్టులో అవకాశం దక్కుతుందేమోనని అందరూ భావించారు.అయితే.. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లో కూడా అర్జున్ టెండూల్కర్ కు తుది జట్టులో ఆడే అవకాశం ఇవ్వలేదు ముంబై జట్టు. హ్రితిక్ సోకీన్, కుమార్ కార్తికేయ సింగ్, సంజయ్ యాదవ్, మార్కండే లాంటి ప్లేయర్స్ ముంబై తరఫున అరంగేట్రం చేసినా అర్జున్ కు మాత్రం చోటు దక్కలేదు. క్రికెట్ దేవుడి తనయుడు అరంగ్రేటం చేస్తే చూడాలనుకున్న అభిమానుల ఆశలను వమ్ము చేసింది ముంబై ఇండియన్స్ పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. దీనిపై క్రికెట్ దిగ్గజం స్పందించాడు.
‘నేను ఎప్పుడూ టీం ఎంపికలో పాల్గొనను. ఆటగాళ్లకు సలహాలు మాత్రమే ఇస్తాను’ అని సచిన్ చెప్పుకొచ్చాడు. ఇక అర్జున్ గురించి మాట్లాడుతూ ‘ ఐపీఎల్ 2022 సీజన్ ముగిసింది. అర్జున్ విషయంలో నేను కఠినంగానే ఉంటాను. నువ్వు క్రికెట్ ఆడటం మొదలుపెట్టావు అంటే నీకు ఈ ఆట అంటే ఇష్టం. కనుక జట్టులో చోటు సాధించేవరకు కష్టపడి పనిచేయ్.. అప్పుడే నువ్ విజయం సాధిస్తావ్ అని అర్జున్ కి చెప్పాను’ అని చెప్పుకొచ్చాడు. సొంత కొడుకైనా.. అందరి ఆటగాళ్ల ముందు ఒకడే.. అన్న సచిన్ మాటలపై.. అభిమానూలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. “అర్జున్ నిరాశపడకు.. ఎప్పటికైనా జట్టులో నీకు చోటు ఖాయం” అని కామెంట్ చేస్తున్నారు.
Sachin Tendulkar’s advice to his son Arjun on not getting chances in MI’s playing XI.#SachinTendulkar #MumbaiIndians #IPL2022 #ArjunTendulkar #CricTracker #Cricket pic.twitter.com/Z6GCmMmwWI
— CricTracker (@Cricketracker) May 25, 2022
సచిన్ తనయుడికి మరో ఘోర అవమానం..
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా బెంచ్‌కే పరిమితమైన సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు మరో అవమానం జరిగింది. రంజీ నాకౌట్స్ కోసం ప్రకటించిన ముంబై జట్టులో అతని స్థానం గల్లంతైంది. ముంబై తరఫున టీ20ల్లో మాత్రమే అరంగేట్రం చేసిన అర్జున్.. ఈ సీజన్ నాకౌట్ మ్యాచ్ ద్వారా ఎలాగైనా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని భావించాడు. అయితే సెలెక్టర్లు అతని ఆశలను అడియాశలు చేశారు. ఐపీఎల్‌లో 30 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్ ఒక్క మ్యాచ్ కూడా ఆడించకుండా అవమానించగా.. తాజాగా ముంబై రంజీ టీమ్ కూడా అదే తరహాలో అర్జున్‌పై శీతకన్ను వేసింది. మరి.. అర్జున్ టెండూల్కర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Rohit Sharma-Ritika Sajdeh: భార్యతో కలిసి మాల్దీవుల్లో రోహిత్ శర్మ..! ఫొటోస్ వైరల్!
