ఐపీఎల్ 2022లో శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య హైటెన్షన్ మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. ఈ వివాదంతో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తీవ్ర విమర్శల పాలవుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. చివరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 36 పరుగులు అవసరమైన దశలో మెకాయ్ బౌలింగ్‌లో తొలి రెండు బంతులను ఢిల్లీ ఆల్‌రౌండర్ పావెల్ సిక్సర్లుగా మలిచాడు. మూడో బంతిని మెకాయ్ ఫుల్ టాస్‌గా వేశాడు. ఆ బంతి పావెల్ నడుము పై భాగం కంటే ఎక్కువ ఎత్తులో వచ్చింది. దాన్ని కూడా పావెల్ సిక్స్ కొట్టాడు.
కానీ అంపైర్ దాన్ని నో బాల్‌గా ప్రకటించకుండా.. ఫెయిర్ డెలవరీగానే గుర్తించాడు. కానీ డగౌట్ నుంచి ఢిల్లీ ఆటగాళ్లు అది నోబాల్ అంటూ సైగలు చేస్తూ.. తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. పావెల్ కూడా అంపైర్ వద్దకు వెళ్లి మరీ నోబాల్‌పై వాడించాడు. అయినా కూడా అంపైర్ నితిన్ మీనన్ దాన్ని నోబాల్‌గా ప్రకటించలేదు. దీంతో పంత్ తమ బ్యాటర్లను వెనక్కు వచ్చేయాల్సిందిగా చెప్పాడు. ఇంతలో ఢిల్లీ బ్యాటింగ్ కోచ్ వాట్సన్ కలగజేసుకుని సర్దిచెప్పడంతో పావెల్, కుల్దీప్ బ్యాటింగ్ కొనసాగించారు. కాగా ఈ ఘటన క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని.. రిషభ్ పంత్ ప్రవర్తన ఏ మాత్రం హర్షనీయం కాదంటూ మాజీ క్రికెటర్లు పంత్‌పై మండిపడ్డారు. అలాగే పంత్ చేసిన పనిపై సోషల్ మీడియాలో సైతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.తాజాగా ఈ ఘటనపై స్పందించిన పంత్.. తప్పు తమదే అని ఒప్పుకున్నాడు. కానీ..‘అది కచ్చితంగా నోబాలే. ఆ సమయంలో మేమంతా ప్రస్టేషన్‌లో ఉన్నాం. నోబాల్ ఇవ్వనందుకు చాలా డిజపాయింట్ అయ్యాం. గ్రౌండ్‌లోకి వెళ్లడం మా తప్పే.. కానీ ఆ ఉద్రిక్త సమయంలో అలా జరిగిపోయింది’ వివరణ ఇచ్చాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వీడియో: నో బాల్‌పై రచ్చ.. పంత్‌తో వాదనకు దిగిన బట్లర్
Rishabh Pant on no-ball drama in the last over.
📸: Disney+Hotstar pic.twitter.com/x13i5r8u2g
— CricTracker (@Cricketracker) April 22, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.