ఎంసీఏ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 13 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో ఆర్సీబీ శిబిరంలో ఆనందాలు వెల్లివిరిశాయి. కీలకమైన మ్యాచ్‌లో గెలుపొందడంతో డ్రెస్సింగ్ రూంలో సందడి నెలకొంది. ఆటగాళ్లంతా ఒక్కచోట చేరి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మాక్స్‌వెల్.. విరాట్ కోహ్లిని ఆటపట్టించాడు.
రనౌట్‌ను గుర్తుచేస్తూ ‘‘అమ్మో.. నీతో కలిసి బ్యాటింగ్ చేయలేను బాబూ.. నువ్వు చాలా వేగంగా పరిగెడతావు.. సింగల్ వచ్చేదగ్గర రెండు తీయగలవు, కానీ.. నేను తీయలేను’ అని మ్యాక్స్‌వెల్ గట్టిగా చెప్పడం కనిపించింది. అయితే, కోహ్లి మాత్రం తనకేమీ పట్టనట్లు.. ‘ఏంట్రా బాబూ ఇది’’ అన్నట్లు ముఖం పెట్టి బ్యాట్ సర్దిపెట్టుకున్నాడు. డ్రెస్సింగ్ రూములో సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇది కూడా చదవండి: మేము మనసు పెట్టి ఆడితే ఎంతటి జట్టుకైనా ఓటమే: RCB
అసలు ఏం జరిగిందంటే?.. ఇన్నింగ్స్ 9వ ఓవర్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో సింగిల్‌కు పెద్దగా అవకాశం లేనప్పటికీ కోహ్లి పరుగుకు యత్నించాడు. ఆ సమయంలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న మ్యాక్సీ.. కోహ్లికి బదులిచ్చే క్రమంలో క్రీజును వీడాడు. అయితే, అప్పటికే బంతిని అందుకున్న రాబిన్ ఊతప్ప.. వికెట్ కీపర్ ధోనికి త్రో వేశాడు. దీంతో వెంటనే ధోని వికెట్లను గిరాటేయడంతో మాక్సీ(3) రనౌట్‌గా వెనుదిరిగాడు. రనౌట్ తర్వాత మాక్సీ.. కోపంగా కోహ్లీ వైపు చూసి మౌనంగా పెవిలియన్ బాటపట్టాడు. ఇదిలా ఉండగా కోహ్లి ఈ మ్యాచ్‌లో 33 బంతులు ఎదుర్కొని 30 పరుగులు చేసి విజయంలో తన వంతు ప్రాత పోషించాడు. మరి ఆర్సీబీ సెలబ్రేషన్స్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియయజేయండి.
Back to winning ways and heading in the right direction. 💪🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/5GY8yRWpN5
— Royal Challengers Bangalore (@RCBTweets) May 5, 2022
Back to winning ways on Derby Day! 👊🏻🤩
Extremely crucial 2️⃣ points in the bag. ✅
Let’s take this momentum forward now! 🙌🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #RCBvCSK pic.twitter.com/mxqVACaRcE
— Royal Challengers Bangalore (@RCBTweets) May 4, 2022