ఐపీఎల్ 2022లో కీలక పోరుగు రంగం సిద్ధమైంది. ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడేందుకు రాజస్థాన్ రాయల్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ అహ్మాదాబాద్‌లో జరగనుంది. మరి ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఐపీఎల్ ట్రోఫీ కోసం తుది పోరుకు అర్హత సాధించేందుకు రెండు జట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ లాంటి బలమైన జట్టును ఓడించడంతో ఆర్సీబీకి సంపూర్ణ ఆత్వవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. కానీ.. ఒక సెంటిమెంట్ మాత్రం ఆర్సీబీ అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది.
అదేంటంటే.. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన జట్టు ప్రతీసారీ ఫైనల్స్‌కు వెళ్తుంది. తొలి స్థానాన్ని ఆక్రమించిన జట్లు క్వాలిఫయర్ దశలోనే ఇంటిదారి పట్టిన మ్యాచ్‌లు లేకపోలేదు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండి.. క్వాలిఫయర్ దశలో ఓటమిబాట పట్టాయి కొన్ని టీమ్స్. మూడు, నాలుగు స్థానాల్లో వచ్చిన జట్లు కూడా క్వాలిఫయర్, ఎలిమినేటర్ దశలోనే తిరుగుముఖం పట్టాయి గానీ.. రెండో స్థానంలో నిలిచిన టీమ్ మాత్రం ఐపీఎల్ చరిత్రలో ఫైనల్‌కు వెళ్లకుండా ఆగలేదు. ప్రతిసారి ఫైనల్స్‌లో అడుగు పెడుతూ వస్తోంది. ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచీ ఇది ఓ సంప్రదాయంగా.. ఓ ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందా? ఆర్సీబీ ఫైనల్స్‌కు వెళ్లదా? అంటూ కొంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ టెన్షన్ పడుతున్నారు.కానీ.. మరికొంత మంది ఫ్యాన్స్ ఈ సంప్రదాయాన్ని ఆర్సీబీ బ్రేక్ చేస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఆర్సీబీకి అంతా కలిసివస్తుందని.. ఈ సారి లక్ ఆర్సీబీ వైపే ఉందంటున్నారు. ఈ సీజన్‌లోనే అత్యంత దారుణంగా విఫలం అయిన ముంబై ఇండియన్స్ కీలకమైన మ్యాచ్‌లో అదరగొట్టి ఢిల్లీని ఓడించి ఆర్సీబీకి ప్లేఆఫ్ టూర్ క్లియర్ చేసిందని, అలాగే ఎలిమినేటర్‌లో పటిష్టమైన లక్నో చెత్త ఫీల్డింగ్ వాళ్ల గొయ్యి వాళ్లే తవ్వుకున్నారంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ తమ వైపు అదృష్టం ఉందని చెప్పుకుంటున్నారు. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి మంచి ఫాలోయింగ్ ఉన్న ఆర్సీబీకి ఐపీఎల్ టైటిల్ ఒక్కటి కూడా లేదు. 2016లో ఆ లోటు తీరుతుందని అంతా భావించినా.. ఫైనల్‌లో ఓడి గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది. ఈ సారి అలాంటి పొరపాట్లు జరగవని.. ఐపీఎల్ 2022 ట్రోఫీ కొట్టేది ఆర్సీబీనే అని ఫ్యాన్స్ స్ట్రాంగ్ చెబుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Jos Buttler: బట్లర్‌ను నా రెండో భర్తగా దత్తత తీసుకున్న! స్టార్ క్రికెటర్ భార్య షాకింగ్ కామెంట్స్
Ready to paint Ahmedabad RED. 🔴
Let’s do this, boys! 💪🏻😎#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #PlayOffs #RRvRCB pic.twitter.com/H5rb65UJW1
— Royal Challengers Bangalore (@RCBTweets) May 27, 2022
Today big match RCB vs RR 🏏🏆🥳😎♥️💯🔥 pic.twitter.com/198zLQQfFV
— Albieavaranga (@Albieavaranga2) May 27, 2022